మహేష్ ఇంత స్టారని తెలియదు

Mon Apr 23 2018 13:45:13 GMT+0530 (IST)

భరత్ అనే నేను విడుదల తర్వాత హీరొయిన్ కైరా అద్వాని కాలు భూమి మీద నిలవడం లేదు. కారణం సినిమాకు వస్తున్న రెస్పాన్స్. మొత్తం మహేష్ వన్ మెన్ షోనే అయినప్పటికీ అంత తక్కువ స్పేస్ లోను తన అందంతో ఆకట్టుకున్న కైరా ఇప్పుడు కొత్త తరం హీరొయిన్స్ లో రేస్ లో ముందుకు వచ్చేసింది. రామ్ చరణ్-బోయపాటి ఛాన్స్ కూడా కొట్టేసిన కైరా రాజమౌళి మల్టీ స్టారర్ కోసం కూడా లైన్ లో ఉందన్న వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా ఒప్పుకునే టైంలో మహేష్ స్టార్ హీరో అని తెలుసన్న కైరా అతని రేంజ్ ఏంటో థియేటర్ల దగ్గర కట్ అవుట్లు - గజమాలలు - బ్యానర్లు షూటింగ్ స్పాట్ దగ్గర జన సందోహాలు చూసి తెలుసుకున్నాను అని చెప్పింది. చాలా కలివిడిగా ఉండే మహేష్ తో నటించడం స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పిన కైరా తన అదృష్టానికి మురిసిపోతోంది.ఇక తన ఫేవరేట్ సీన్ గురించి చెబుతూ అందరికి లాగే తనకూ ప్రెస్ మీట్ సీన్ అద్భుతంగా నచ్చిందని చెప్పింది. ఫస్ట్ టైం ఆ సీన్ చూసుకున్నప్పుడు అందులో తాను కూడా ఉన్నాను కాబట్టి రోమాలు నిక్కబోడుచుకున్నంత ఫీలింగ్ కలిగింది అని చెప్పిన కైరా సిటీ వదిలి వెళ్ళిపోయే టైంలో మహేష్ బాబు తనను కలుసుకునే ఎమోషనల్ సీన్ అంటే బాగా ఇష్టమట.ఇంకా చాలా విశేషాలే పంచుకున్న కైరా మొదటి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్ రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళిన నేపధ్యంలో మరికొన్ని రోజులు హైదరాబాద్ తోనే తన అనుబంధం కొనసాగనుంది. ఒకవేళ సినిమాలోలాగా నిజంగా సిఎంను కలవాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతావు అంటే సినిమాలో ఏదైతే చేశాను అది సహజంగానే చేసానని అది నిజమైతే అందులో ఏ మార్పు ఉండదని చెప్పేసింది. కైరా వరస చూస్తుంటే బాలీవుడ్ కు తిరిగి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు.