Begin typing your search above and press return to search.

కియ‌రా డ్యాన్సులు ర‌చ్చ ర‌చ్చ‌లే

By:  Tupaki Desk   |   20 March 2019 5:01 AM GMT
కియ‌రా డ్యాన్సులు ర‌చ్చ ర‌చ్చ‌లే
X
భ‌ర‌త్ అనే నేను - విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించింది కియ‌రా అద్వాణీ. న‌టించింది రెండు సినిమాలే అయినా త‌న‌కు అంత‌కుమించి ఐడెంటిటీ ద‌క్కింది. న‌వ‌త‌రం అంద‌గ‌త్తెల్లో వాడి వేడి ఉన్న అమ్మ‌డిగా పాపులారిటీ ద‌క్కించుకుంది. ఓవైపు టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుంటూనే, మ‌రోవైపు ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో కియ‌రా నిరంత‌రం హాట్ టాపిక్ అవుతోంది. ముంబైలో ఏ ర్యాంప్ షో జ‌రిగినా అక్క‌డ కియరా త‌ప్ప‌నిస‌రిగా వాలిపోతోంది. పార్టీలు, ప‌బ్బులు, క్ల‌బ్బులు, ఫంక్ష‌న్లు ఏదైనా అక్క‌డ కియ‌రా ర్యాంప్ షో త‌ప్ప‌నిస‌రి. ఇటీవ‌లి కాలంలో ఇంత వేగంగా పాపుల‌రైన వేరొక నాయిక లేదంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం రెండే రెండేళ్ల‌లో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ ని అందుకున్న బ్యూటీగా కియ‌రా పేరు మార్మోగిపోతోంది.

లేటెస్టుగా ఈ బ్యూటీ ప్ర‌ఖ్యాత జీ సినీ అవార్డ్స్ 2019 వేడుక‌లో త‌ళుకుబెళుకుల ప్ర‌ద‌ర్శ‌న‌తో మతి చెడ‌గొట్టింది. ఈ పుర‌స్కారాల వేళ ఇన్ స్టాగ్ర‌మ్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌కు సంబంధించిన ఫోటోల్ని కియ‌రా షేర్ చేసింది. ఇవ‌న్నీ యూత్ గుండెల్లో బుల్లెట్లు లా దూసుకుపోతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జీ అవార్డుల వేడుక‌లో కియ‌రా ఇచ్చిన డేర్ డెవిల్ పెర్ఫామెన్స్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి బ‌ద్లాపూర్ నుంచి జీనా జీనా పాట‌కు .. ఏబీసీడీ 2 నుంచి స‌న్ సాథియా.. పాట‌కు స్టెప్పు క‌లిపిన కియ‌రా కిర్రాక్ స్టెప్పుల‌తో మ‌తి చెద‌ర‌గొట్టేసింది.

ధావ‌న్ బోయ్ అంటేనే డ్యాన్సుల్లో మెరుపులు.. ఉరుములు. అలాంటి ట్యాలెంటెడ్ గ‌య్ తో కియ‌రా పోటీ ప‌డుతూ డ్యాన్సులు చేయ‌డం గురించి ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ సింక్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. కియరా ఇస్పీడ్ చూస్తుంటే ఇటు సౌత్ ఇండ‌స్ట్రీస్ తో పాటు అలు ముంబై ప‌రిశ్ర‌మ షేక్ అవ్వాల్సిందేన‌ని తాజా ఈవెంట్ చెబుతోంది.