Begin typing your search above and press return to search.

పిచ్చెక్కించేస్తున్న మహేష్ హీరోయిన్

By:  Tupaki Desk   |   17 Jun 2018 11:53 AM GMT
పిచ్చెక్కించేస్తున్న మహేష్ హీరోయిన్
X
తెలుగులో తన తొలి సినిమానే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో చేసింది కియారా అద్వానీ. ఇక్కడ ఆమె డెబ్యూ మూవీ ‘భరత్ అనే నేను’ మంచి ఫలితాన్నందుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరే వచ్చింది. నటనతో పాటు అందంతోనూ కియారా మెప్పించింది. ‘భరత్ అనే నేను’లో ఆమె చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. బాలీవుడ్లో ఇంతకుముందు చేసిన ‘ఎం.ఎస్.ధోని’లోనూ కియారాది పద్ధతైన పాత్రే. దీంతో ఆమెకు ట్రెడిషనల్ ఇమేజ్ వచ్చేసింది. అలాంటి కథానాయిక ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియోల్లో కనిపిస్తున్న తీరు షాకిస్తోంది.

డిజిటల్ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’లో కియారా పోషించిన పాత్ర షాకిచ్చేదే. ఇందులో స్వయం తృప్తి కోసం ఆమె వైబ్రేటర్ వాడే మహిళగా కనిపించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త.. అత్తింటి వాళ్లకు దొరికిపోతుంది. ఈ సీన్ మీదే ‘లస్ట్ స్టోరీస్’ ట్రైలర్ కట్ చేశారు. వైబ్రేటర్ పని చేసే క్రమంలో ఆమె ఇచ్చిన హావభావాలు కుర్రకారుకు పిచ్చికెక్కించేస్తున్నాయి. ఇన్నాళ్లూ ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇలాంటి షాకింగ్ క్యారెక్టర్ చేసి.. అలాంటి హావభావాలు ఇచ్చేసరికి విస్మయం చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ చేయడం ద్వారా తనలోని మరో యాంగిల్ ను చూపించిన కియారాకు మున్ముందు హాట్ హాట్ పాత్రలు వరిస్తాయేమో.