Begin typing your search above and press return to search.

ఔను.. 'అర్జున్ రెడ్డి' రీమేక్ చేస్తున్నా

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:32 AM GMT
ఔను.. అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నా
X
ఎట్టకేలకు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ సంగతి ఒక కొలిక్కి వచ్చింది. గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన కొన్ని నెలలకే ఈ చిత్ర హిందీ రీమేక్ కన్ఫమ్ అయింది కానీ.. కాస్టింగ్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి. ముందు హీరో ఎవరనే విషయంలో సందిగ్ధత నడిచింది. షాహిద్ కపూర్ కన్ఫమ్ అయ్యాక కథానాయిక సంగతి తేల్చడానికి చాలా సమయం పట్టింది. చివరికి తారా సుతారియా అనే అమ్మాయికి కన్ఫమ్ చేశారు కానీ.. ఆమె షూటింగ్ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సినిమా మరింత ఆలస్యమవుతుందనుకున్నారు. కానీ పెద్దగా నాన్చకుండా కొన్ని రోజుల్లోనే ఆమెను మరో కథానాయికతో రీప్లేస్ చేశారు. ‘భరత్ అనే నేను’ భామ కియారా అద్వానీని ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్లు కొన్ని రోజుల కిందటే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని స్వయంగా కియారానే కన్ఫమ్ చేసింది. తాను ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ లో నటిస్తున్నట్లు ఈ రోజు ట్విట్టర్లో కియారా ధ్రువీకరించింది. ఈ సందర్భంగా ‘అర్జున్ రెడ్డి’ గురించి ఆమె గొప్పగా మాట్లాడింది. గత ఏడాది ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడ్డ చిత్రాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటని.. తనకు కూడా ఈ సినిమా ఎంతో నచ్చిందని.. ఇలాంటి సినిమాలో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. తాను ఈ పాత్రకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నట్లు కూడా కియారా పేర్కొంది. కియారాను ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ఎంచుకోవడం మరింత కలిసొస్తుందనే అనుకుంటున్నారు. తార గురించి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో.. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తో కియారా సూపర్ పాపులారిటీ సంపాదించింది. అందం.. అభినయం రెండూ ఉన్న ఈ భామ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. షాహిద్-కియారా మధ్య ముద్దులు.. ఇంటిమేట్ సీన్లు ప్రేక్షకుల్లో వేడి పుట్టిస్తాయనడంలో సందేహం లేదు.