పిచ్చెక్కించేలా లస్ట్ భామ నాట్యం!

Sat Apr 20 2019 14:00:35 GMT+0530 (IST)

బాలీవుడ్ లో పార్టీ కల్చర్ చాలా ఎక్కువ.  ఏ చిన్న అకేషన్ ఉన్నా సరే పార్టీ చేసుకుంటారు.  సెలబ్రిటీలంతా చక్కగా తయారై పొలోమని పార్టీ లొకేషన్ కు వెళ్తారు.  రీసెంట్ గా అలానే ఒక పేజ్ 3 పార్టీలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేయగా బాలీవుడ్ బ్యూటీలు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేశారు.ఈ ఈవెంట్ లో సోనాక్షి సిన్హా.. తారా సుతారియ.. అదితి రావు హైదరీ.. అనన్య పాండే కియారా అద్వాని.. ఇలా ఈ జెనరేషన్ బ్యూటీలందరూ ఒకచోట చేరడంతో సందడి నెలకొంది.  ఈ సెలెబ్రేషన్ లో వరుణ్ ధావన్.. కియారా.. సోనాక్షిలు కలిసి తాజా  బాలీవుడ్ చిత్రం 'కళంక్' లోని ఫస్ట్ క్లాస్ సాంగ్ కు రచ్చగా డ్యాన్స్ చేశారు.  హోస్ట్ మనీష్ కు కాసిన్ని స్టెప్పులు కూడా నేర్పించి ఆయన చేత కూడా డ్యాన్స్ వేయించారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  అసలే లస్ట్ భామ కావడంతో వైరల్ కూడా అయిపోయింది.  ఇప్పటికే మీరు చూస్తే సరే.. లేకపోయినా ఏం నష్టం లేదు మరో సారి చూసేయండి.

ఇక కియారా కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటే 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' ల నటిస్తోంది.  ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవుతోంది.  ఈ సినిమా కాకుండా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'గుడ్ న్యూస్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.