Begin typing your search above and press return to search.

శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ చేసేస్తోంది

By:  Tupaki Desk   |   28 May 2017 5:42 AM GMT
శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ చేసేస్తోంది
X
అలనాటి మేటి అందాల తార శ్రీదేవికి.. ఇప్పటికీ తన యాక్టింగ్ లో మెరుపులు చూపించే ట్యాలెంట్ ఉంది. మధ్య మధ్యలో లేటెస్ట్ ఫ్యాషన్ తో అలరిస్తూ ఉంటుంది. అయితే.. కొంతకాలంగా శ్రీదేవి కంటే ఆమె కూతుళ్లే ఎక్కువగా వార్తల్లో నానుతున్నారు. ముఖ్యంగా పెద్ద కూతురు జాన్వి కపూర్ గురించి అయితే.. తెగ న్యూస్ వచ్చేస్తుంటాయి. ఎఫైర్స్.. ఆఫర్స్.. గ్లామర్.. సోషల్ మీడియా పిక్స్.. ఇలా ఓ సెలబ్రిటీ టీనేజ్ డాటర్ గురించి ఎన్ని రకాల న్యూస్ కు ఛాన్స్ ఉందో.. అన్నీ వచ్చేశాయి.

ఇప్పటివరకూ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి మాత్రమే ఇండస్ట్రీ అంచనాలు.. అభిమానుల హోప్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కానీ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఖుషీ కపూర్ వయసు 17 సంవత్సరాలు కావడం.. అందంలో అమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం.. ఈ జనరేషన్ గాళ్ కావడం.. పైగా ఫ్యాషన్ విషయంలో అప్ డేటెడ్ గా ఉండడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ టీనేజ్ గాళ్ ను తండ్రి బోనీ కపూర్.. తల్లి శ్రీదేవితో కలిపి ఓ ఫోటోలో చూసిన వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది.

ఫ్యూచర్ లో సెన్సేషన్స్ సృష్టించబోయే భామ అని ఇప్పటికే అనిపించేసుకుంటోంది ఖుషీ కపూర్. ఇంకా అక్క అరంగేట్రం కాకముందే ఇంతలేసి ఫ్యాషన్ చూపిస్తే.. జాన్వీ ఎంట్రీ ఇచ్చి.. ఈమె తెరంగేట్రం చేసే సమయానికి మరెంతగా అందాల హంగామా ఉంటుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/