ఓ కంట నీరు.. ఓ కంట ఆనందం

Tue Jun 12 2018 10:06:45 GMT+0530 (IST)

అందాల తార శ్రీదేవి అభిమానులు.. బాలీవుడ్ జనాలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ వెండితెరపై మెరవనుంది. ఆమె హీరోయిన్ గా నటించిన ధడక్ మూవీ ట్రయిలర్ రీసెంట్ గా విడుదలైంది. హీరోయిన్ కావాలని జాన్వితోపాటు ఆమె తల్లి శ్రీదేవి కూడా ఎంతగానో కోరుకుంది. ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్లో జాన్వి కళ్లలో తల్లి కోరిక నిజం చేశానన్న ఆనందంతోపాటు ఈ క్షణం ఆమె పక్కన లేదన్న ఆవేదన స్పష్టంగా కనిపించింది.ట్రైలర్ లాంచ్  ఈవెంట్లో బాధనంతా గుండెల్లో దాచుకుని మామూలుగా కనిపించడానికి జాన్వి శతవిధాలా ప్రయత్నించింది. కానీ శ్రీదేవి చిన్న కూతురు.. జాన్వి చెల్లెలు మాత్రం మనసులోని ఉద్విగ్నతను దాచుకోలేకపోయింది. దాంతో అక్క వద్దకు చేరుకుని కన్నీళ్లు పెట్టేసుకుంది. ఆ క్షణం వాళ్లిద్దరిని చూసిన అక్కడున్న అందరి కళ్లు చెమర్చాయనే చెప్పాలి. ఈ ఈవెంట్లో శ్రీదేవి గురించి చెప్పమని అడిగినప్పుడు జాన్వి చెప్పిందల్లా ఒకటే.. ‘ఐ మిస్ డ్ హర్ ఎలాట్’’ అని. ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు కపూర్ ఫ్యామిలలోని అందరూ అటెండయి జాన్వి సపోర్టివ్ గా నిలవడం విశేషం.

జాన్వి మొదటి సినిమా ధడక్ లో బాలీవుడ్ హీరో - షాహిద్ కపూర్ తమ్ముడు హీరోగా నటిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ సైరట్ కు రీమేక్ గా ధడక్ తెరకెక్కింది. శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన ఈమూవీని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించాడు. 

వీడియో కోసం క్లిక్ చేయండి