Begin typing your search above and press return to search.

మార్కెట్లో లేని ప్రొడక్ట్ కి ఖాన్ ల ప్రచారం

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:30 PM GMT
మార్కెట్లో లేని ప్రొడక్ట్ కి ఖాన్ ల ప్రచారం
X
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ లో సెన్సేషన్స్ నమోదవుతూనే ఉన్నాయి. మోటుగా మారిపోయిన అమీర్ ఖాన్ లుక్ ఒకవైపు.. మరోవైపు యంగ్ రెజ్లర్ గా మెరుపులతో.. అభిమానులను అమీర్ ఆకట్టుకున్నాడు. అయితే.. ఈ ట్రైలర్ లో మరొక విషయం సినీ లవర్స్ ను ఆకట్టుకుంది. పాతకాలం నాటి ఓ బజాజ్ స్కూటర్ పై అమీర్ ఖాన్ ట్రావెల్ చేస్తున్నట్లు చూపించారు.

ఖాన్ త్రయం తమ సినిమాల్లో ఈ బజాజ్ స్కూటర్ ని ఉపయోగించారు. ఇప్పుడా ప్రొడక్ట్ మార్కెట్లో నిలిచిపోయింది కానీ.. పీరియాడిక్ సినిమాలను చూపించడానికి మాత్రం బజాజ్ స్కూటర్ కి మించిన ఆప్షన్ వేరొకటి దర్శకులకు దొరకడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సుల్తాన్ మూవీలో కూడా సల్మాన్ ఖాన్ స్కూటర్ పై చక్కర్లు కొట్టడం చూశాం. కొన్నేళ్ల క్రితం వచ్చిన రబ్ నే బనాదీ జోడీ మూవీలో షారూక్ ఖాన్ కూడా బజాజ్ స్కూటర్ పైనే రైడింగ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఖాన్ హీరోలంతా బజాజ్ స్కూటర్ పైనే తిరుగుతూ సినిమాల్లో కనిపించడం మాత్రం కేవలం కో-ఇన్సిడెన్సే.

నిజానికి ఇలా ముగ్గురు స్టార్లు ఒకే ప్రొడక్టుకు ప్రచారం చేయడమంటే అది చాలా పెద్ద విషయంగా చెప్పాలి. అదే ప్రొడక్టు మార్కెట్లో ఉంటే మాత్రం ఇప్పటికే బోలెడన్ని సేల్స్ వచ్చిపడేవి. అయినా అలా మార్కెట్లో ఉన్న వస్తువులకు వీళ్లు కూడా బ్రాండింగ్ చేయరు లెండి. ఇక రీసెంట్ గా 'తీన్' మూవీలో బిగ్ బీ కూడా ఈ బజాజ్ స్కూటర్ నే నడిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/