Begin typing your search above and press return to search.

ఖైదీ నెం 150: బర్త్ డే టీజర్ కేక

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:12 AM GMT
ఖైదీ నెం 150: బర్త్ డే టీజర్ కేక
X
ఇప్పటివరకు టైటిల్ ఏంటో తెలియన కన్ఫూజన్లో ఉన్న జనాలకు.. ''ఖైదీ నెం 150'' సదరు టైటిల్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కొణిదెల ప్రొడక్షన్స్ వారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా టైటిల్ ను కేవలం కరారు చేయడమే కాదు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఒక ప్రత్యేక ప్రీ-టీజర్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

149 సినిమాల ధీరుడు.. 37 సంవత్సరాలు పాలించిన చక్రవర్తి.. కోట్ల హృదయాలను గెలుచుకున్న యోధుడు.. అంటూ మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఏకంగా ఒక టీజర్ రెడీ చేశారు. ఇందులో టైటిల్ కూడా ఇంకా చెప్పలేదు కాని.. తోట తరణి కళతో.. రత్నవేలు కన్నుతో.. దేవిశ్రీ వంటి రాక్ స్టార్ సంగీతంతో.. మెగా పవర్ ప్రొడ్యూసర్ అధ్యక్షతన.. డైనమిక్ వినయక్ దర్శకత్వంలో.. ''మెగాస్టార్ 150'' వస్తోందని ప్రకటించారు. ఈ టీజర్ వీడియో అదిరిపోయింది కాని.. ఇప్పుడు అందరూ ఖైదీ నెం 150 మోషన్ పోస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.

#HBDMegastarChiranjeevi, #BossIsBack అనే రెండు హ్యాష్‌ ట్యాగులను ట్రెండ్ చేయడానికి కొణిదెల ప్రొడక్షన్స్ వారు ఈ బర్తడే టీజర్ రిలీజ్ చేశారట. అయితే వారుకున్నట్లే రాత్రి కేవలం 30 నిమిషాల్లో ఈ ట్యాగులు హైదరాబాద్ మరియు తెలుగు ప్రజలు అనేకంగా ఉన్న ప్రాంతాల్లో ట్రెండ్ అవ్వడం మొదలైంది. అది సంగతి.