బాక్స్ ఫీస్ కు షేకులే.. షేకులా?

Thu Jan 12 2017 15:01:39 GMT+0530 (IST)

సంక్రాంతి అన్న వెంటనే పండగ హడావుడితో పాటు.. భారీ సినిమాల విడుదల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రహీరోల సినిమాలు పరస్పరం పోటీ పడినా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు అగ్రనటులకు సంబంధించిన మైల్ స్టోన్ స్థాయి సినిమాలు పోటాపోటీగా పోటీపడటం.. నువ్వా నేనా అన్న రేంజ్లో విడుదల డేట్లు పిక్స్ చేసుకోవటంతో తెలుగు సినీ పరిశ్రమలోనూ.. అభిమానుల్లో చర్చల హీట్ ఓ రేంజ్ కి వెళ్లేలా చేసింది.

రోజు తేడాతో చిరు 150వ చిత్రం ఖైదీ నంబరు 150.. బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల కావటంతో..ఈ రెండు సినిమాల్లో విజయం దేనికి సొంతం అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇద్దరు దర్శకులు బలమైన వారు కావటం.. వారు ఎంచుకున్న సబ్జెక్ట్ లు ఆసక్తికరంగా ఉండటంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఇద్దరు హీరోలకు ఈ సినిమాలు ప్రాణ సమానమైనవి కావటం.. ఈ సినిమా విజయం వారి వ్యక్తిగత ప్రతిష్టలతో ముడిపడి ఉండటంతో టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది. కొంతకాలంగా సాగుతున్న అంచనాలకు బ్రేక్ పడిపోయింది. నిన్న విడుదలైన ఖైదీ చిత్రంపై పాజిటివ్ రిపోర్ట్స్ రాగా.. తాజాగా విడుదలైన శాతకర్ణి సైతం సక్సెస్ అయినట్లుగా వార్తలు వచ్చేయటం చిత్రపరిశ్రమకు సంక్రాంతిగా మారింది. ఇంకా.. పండక్కి రావాల్సిన చిత్రాలు రెండు ఉన్నా.. అగ్రహీరోల సినిమాలు సక్సెస్ రేంజ్ ఓ స్థాయిలో ఉందన్న వార్తతో.. బాక్స్ ఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపటం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వేళ.. కలెక్షన్ల వర్షం భారీగా ఉంటుందన్న అంచనాలతో పాటు.. సరికొత్త రికార్డులు నెలకొనచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/