ఖైదీ 25 కోట్ల రికార్డు కొట్టేస్తోందా??

Tue Jan 10 2017 22:43:21 GMT+0530 (IST)

ఖైదీ నంబర్ 150.. మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో మెగా హంగామా చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. ట్రేడ్ పండిట్స్ నుంచి.. తెలుగు ఆడియన్స్ అందరి దృష్టి ఒక్క పాయింట్ పైనే కేంద్రీకృతమైంది. అందరూ ఆలోచించేది మెగాస్టార్ మొదటిరోజున ఎన్ని రికార్డులు సృష్టించబోతున్నారన్నదే!

ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లో  మెగాస్టార్ చిరంజీవి ఎంత షేర్ రాబట్టబోతున్నారు? ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైపోతాయా? 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరు.. తన స్టామినా ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నారు? అంటూ చాలానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకూ తొలిరోజు ఏపీ-నైజాం మార్కెట్లలో తొలిరోజు షేర్ వసూళ్ల రికార్డు బాహుబలి పేరిట ఉంది. 22.4 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే.. ఖైదీ నంబర్ 150 ఈ మార్కును తేలిగ్గానే అధిగమించేస్తుందని అంటున్నారు ట్రేడ్ జనాలు.ఇందుకు కారణం.. అన్ని ఏరియాల్లోను ఇప్పటికే ఫుల్ క్రేజ్ తో హౌస్ ఫుల్స్ పడిపోవడమే.

కానీ బాహుబలి మార్క్ అందుకోవడం అంత తేలికేం కాదు. ఎందుకంటే రెగ్యులర్ షోస్ పాటు అదనంగా వేసే షోస్.. హైర్స్.. అన్నిటినీ కౌంట్ చేయాల్సి ఉటుంది. నైజాంతో పాటు.. ఉత్తరాంధ్ర.. ఈస్ట్.. వెస్ట్.. కృష్ణా.. నెల్లూరు.. సీడెడ్.. ఇలా అన్ని ఏరియాల నుంచి అందుతున్న రిపోర్టుల ప్రకారం.. ఖైదీ నంబర్ 150 తొలిరోజున ఖచ్చితంగా 25-28 కోట్ల షేర్ ను కేవలం ఏపీ నుంచే రాబట్టే అవకాశాలున్నాయట. మరి చిరు ఆ మార్క్ అందుకుంటే మాత్రం.. కొత్త హిస్టరీ రాసేసినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/