Begin typing your search above and press return to search.

ఖైదీ సాంగ్స్.. కుర్రాళ్లకి భలే ఎక్కేస్తున్నాయే

By:  Tupaki Desk   |   22 Jan 2017 3:58 AM GMT
ఖైదీ సాంగ్స్.. కుర్రాళ్లకి భలే ఎక్కేస్తున్నాయే
X
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ఇప్పుడు టాలీవుడ్ లో ఆల్ టైం సెకండ్ బిగ్గెస్ట్ స్లాట్ లోకి కూడా ఎంటర్ అయిపోయింది. వంద కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం ఇప్పుడు ఖైదీకి చాలా సింపుల్ అని తేలిపోయింది. అయితే.. ఈ మూవీ ఇంత సక్సెస్ సాధించడంలో.. పాటలు కీలకం అనే మాట ఒప్పుకోవాల్సిందే. మెగాస్టార్ సినిమాని జనాలు చూసేదే.. పాటలు వాటిలో ఆయన డ్యాన్సులతో చేసే మ్యాజిక్ కోసం అనడంలో సందేహం అక్కర్లేదు.

ఆడియో ఫంక్షన్ జరపకుండా.. నేరుగా యూట్యూబ్ లో ఖైదీ నంబర్ 150 పాటలను ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే.. పాటలు వ్యూస్ అయితే.. మిలియన్ల కొద్దీ వచ్చాయ్ కానీ.. యూట్యూబ్ వ్యూస్ మాత్రం మిలియన్ల కొద్దీ వచ్చిపడిపోయాయి. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ యావరేజ్ గా ఉందనే విమర్శలు అయితే కోకొల్లలు గా ఉన్నాయి.

కానీ యూత్ మాత్రం ఖైదీ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. యూ అండ్ మీ.. సుందరి పాటలు అయితే.. ఎఫ్ఎం రేడియోలు.. ఐపాడ్ లలో హోరెత్తించేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.,. ఇప్పుడు ఇవే పాటలకు డ్యాన్స్ లు వేసేసి యూట్యూబ్ లో పెట్టేయడం కూడా కొత్త ట్రెండ్ అయిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి.. కాజల్ చేసిన సాంగ్ లకు యాజిటీజ్ గానో.. సొంత కొరియోగ్రఫీతోనో.. గ్లామర్ జోడించి మరీ పాటలను నెట్ లో పెట్టేస్తున్నారు యూత్. ఒక్క సినిమాటోగ్రఫీ లోపం మినహాయిస్తే.. ఒరిజినల్ ను తలపించేస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. యూ అండ్ మీ సాంగ్ కు దీప్తి సునయన.. షణ్ముఖ్ జస్వంత్ లు చేసిన సాంగ్ ఇందులో ఒకటిగా చెప్పచ్చు.

మొదట దేవిశ్రీ ఏంటీ.. మెగా 150కి ఇలాంటి యావరేజ్ మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు కానీ.. వాటి రేంజ్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. ఎక్కడైనా మెగా సాంగ్స్ మోత మోగిపోతున్నాయంటే.. దటీజ్ మెగాస్టార్ విత్ రాక్ స్టార్ కాంబినేషన్ అనే సంగతి ఒప్పుకోవాల్సిందే.







Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/