ఆట్.. బాస్ ఈజ్ బ్యాక్.. 1+ మిలియన్

Wed Jan 11 2017 11:57:18 GMT+0530 (IST)

10 సంవత్సరాలు నిజంగానే బ్రేక్ తీసుకుని వచ్చారా లేకపోతే ఏదో 10 నిమిషాలు అలా ప్రక్కకెల్లి వచ్చారా మెగాస్టార్ చిరంజీవి అంటూ డౌట్లు వచ్చేస్తున్నాయి తెలుగు ప్రేక్షకులకు. ఇప్పటివరకే ఓవర్సీస్ బాక్సాఫీస్ అంటే ప్రీమియర్లతో 1 మిలియన్ డాలర్ల వసూలు అనేది కేవలం బాహుబలికి మాత్రం సాధ్యపడింది. అయితే వందల కోట్ల గ్రాఫిక్స్ సినిమా ఒకెత్తు.. మెగాస్టార్ అనే నటిశిఖరం మరో ఎత్తు ప్రూవ్ చేస్తున్నారు చిరంజీవి. అదిగో ఈ ప్రీమియర్ కలక్షన్లే అందుకు నిదర్శనం. బాస్ ఈజ్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ కు నిలువెత్తు సాక్ష్యం.

రాత్రి 10.30 నిమిషాల సమయానికి.. అమెరికాలో 1.131 మిలియన్ డాలర్స్ గ్రాస్  కేవలం ప్రీమియర్స్ ద్వారా వసూలు చేసిందీ ''ఖైదీ నెం 150''. ఇప్పటివరకు టాప్ 1 పొజిషన్లో ఉన్న బాహుబలి తెలుగు వర్షన్ 1.364 మిలియన్ డాలర్లను ప్రీమియర్ల ద్వారా వసూలు చేసిందనే సంగతి తెలిసిందే. అత్యధికంగా ప్రీమియర్స్ లో తెలుగు మరియు ఇతర వర్షన్లను కలుపుకుని 1.47 మిలియన్ బాహుబలి 1 వసూలు చేయగా.. తరువాత సర్ధార్ 643000 డాలర్లు.. అంటే 0.64 మిలియన్ డాలర్ల వసూళ్ళతో 2వ పొజిషన్లో ఉంది. ఇప్పుడు చిరంజీవి ఆ రెండవ పొజిషన్లో 1.1+  మిలియన్ డాలర్ తో తన హవా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఖైదీ నెం 150 సినిమా గురించి ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ''లెట్స్ డూ రికార్డ్స్ కుమ్ముడు'' అంటూ వ్యాఖ్యానించారు. పైగా ట్రెండ్ చూస్తుంటే.. బాహుబలి ప్రీమియర్ కలక్షన్ రికార్డులను ఇప్పుడు చిరంజీవి తిరగరాస్తారని అనిపిస్తోంది. # మెగా సర్జికల్ స్ర్టయిక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/