Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వ‌ద్ద మెగా కలెక్షన్ల కుమ్ముడు!

By:  Tupaki Desk   |   20 Jan 2017 1:36 PM GMT
బాక్సాఫీస్ వ‌ద్ద మెగా కలెక్షన్ల కుమ్ముడు!
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నంబ‌ర్ 150 ఈ సంక్రాంతికి విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో 150 చిత్రం కావ‌డం... పైగా, దాదాపు ద‌శాబ్దం త‌రువాత మెగాస్టార్ వెండితెర‌పైకి మ‌ళ్లీ రావ‌డంతో మెగా అభిమానుల‌కు ఈ సంక్రాంతి సీజ‌న్ అత్యంత ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ సినిమా విడుద‌లై 9 రోజులైంది. కాస్త గ్యాప్ త‌రువాత వ‌చ్చినా కూడా... బాక్సాఫీస్ వ‌ద్ద బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. మెగాస్టార్ మార్క్ డాన్సులూ డైలాగ్ పంచ్ లూ ఫైట్లూ అభిమానుల‌ను విశేషంగా అల‌రిస్తున్నాయి. క‌లెక్ష‌న్ల విష‌యంలో కూడా మెగా రేంజ్ కి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి.

ఏరియాల వారీగా 9 రోజుల కలెక్షన్స్ వివరాలు::

నైజాం - 15.10కోట్లు

సీడెడ్ - 11.70 కోట్లు

నెల్లూరు - 2.68 కోట్లు

గుంటూరు - 5.91 కోట్లు

కృష్ణా - 4.51 కోట్లు

వెస్ట్ గోదావరి - 5.19 కోట్లు

ఈస్ట్ గోదావరి - 6.82 కోట్లు

వైజాగ్ - 9.44 కోట్లు

మొత్తంగా ఏపీ, నైజాం ఏరియా క‌లెన్ష‌న్లు - రూ. 61.35 కోట్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూలైన షేర్ - రూ. 82. 5 కోట్లు

సినిమా విడుద‌లై వారం దాటిపోయినా కూడా క‌లెన్ష‌న్లు ఇంకా స్ట‌డీగానే ఉన్నాయ‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మ‌రికొద్ది రోజుల్లోనే ఏపీ నైజాం షేర్ రూ. 79 కోట్ల మార్కును ఖైదీ దాటేస్తాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. క‌లెక్ష‌న్లప‌రంగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ఖైదీ నిలుస్తుంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి... కాస్త గ్యాప్ తీసుకుని వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాస్ హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటున్నాడు. వంద కోట్ల మార్కువైపు ఖైదీ ప‌రుగులు తీస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/