Begin typing your search above and press return to search.

అఖిల్ మూవీకి కీలకం ఆ సీన్

By:  Tupaki Desk   |   13 Oct 2015 3:30 PM GMT
అఖిల్ మూవీకి కీలకం ఆ సీన్
X
అక్కినేని అఖిల్ లాంఛింగ్ మూవీ అఖిల్ విడుదలకు.. మరో పది రోజుల గడువు కూడా లేదు. ఓ వారం రోజులుగా ప్రచారంలో నెమ్మదించిన అఖిల్ యూనిట్.. మళ్లీ హీట్ పెంచడం మొదలుపెట్టేశారు. బ్రహ్మీని అక్కినేని వారసుడు అఖిల్ ఇంటర్వ్యూ చేసే ఫన్నీ ఎపిసోడ్ ని రిలీజ్ చేసి.. మళ్లీ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు అఖిల్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సంగతులు ఒక్కోటిగై బైటకొస్తున్నాయి.

అఖిల్ ట్రైలర్ లో ఒకచోట.. వాటర్ ఎపిసోడ్ ని ఇలా చూపించి.. అలా తీసేస్తారు. మూవీకి ఈ సన్నివేశం చాలా కీలకమని తెలుస్తోంది. మూవీని ఓ రేంజ్ కి తీసుకెళ్లగల సత్తా ఈ వాటర్ ఎపిసోడ్ కి ఉందన్నది ఇంటర్నల్ సమాచారం. అందుకే ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా సింపుల్ గా ఇలా చూపించి అలా తీసేశారని చెప్పుకుంటున్నారు. అఖిల్ కి నీళ్లంటే చాలా ఇష్టం. అండర్ వాటర్ లో ఇరగదీసే ఫీట్స్ చేయడంలో స్పెషలిస్ట్ ఈ అక్కినేని నయా వారసుడు. అందుకే.. డైరెక్టర్ వినాయక్ కూడా ఈ ఎపిసోడ్ ని మూవీకే హైలైట్ అయ్యేలా తీశాడట.

అయితే.. తొలి ట్రైలర్ పై అంతగా పాజిటివ్ బజ్ రాకపోవడంతో.. మరో ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని చెప్పిన యూనిట్.. ఇప్పటివరకూ సెకండ్ ట్రైలర్ ఇవ్వలేదు. ఈ వారంలో దాన్ని కూడా రిలీజ్ చేసేసి.. మూవీకి మరింత హైప్ తెచ్చే ప్రణాళికలు స్టార్ట్ చేయబోతున్నారు. అక్టోబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీతో.. లాంఛింగ్ కే 50 కోట్ల హీరోగా అవతరించి కొత్త రికార్డ్ సెట్ చేస్తాడని అఖిల్ పై ఆశలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు.