ఫోటో స్టొరీ: రొమాంటిక్ బ్యూటీ రాకింగ్ పోజు

Mon Jun 24 2019 18:09:33 GMT+0530 (IST)

కేతిక శర్మ తెలుసా?  తెలిసి ఉండక పోవచ్చు.  ఎందుకంటే ఈ భామ నటించిన సినిమాలేవీ ఇంకా రిలీజ్ కాలేదు.  అయితే ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సినిమా 'రొమాంటిక్' లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ - ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే పాప పాపులర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఈ ఢిల్లీ బ్యూటీ డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో కొంత గుర్తింపు తెచ్చుకుంది.  అంతే కాకుండా కేతిక ఓ హాట్ మోడల్.  ఫోటో షూట్ చేసిందంటే సోషల్ మీడియా జంక్షన్లన్నీ జామ్ అయిపోవాల్సిందే.  కేతిక సోషల్ మీడియాలో మహా యాక్టివ్.. అందుకే హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి చిన్నపాటి సునామీలను తెప్పిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి అదేపని చేసింది.  కొన్ని హాట్ ఫోటోలు పోస్ట చేసింది.  ఈ ఫోటోలకు "ఈ వారంలోకి చాలా ఊంఫ్ తో అడుగుపెడుతున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఊంఫ్ కి తెలుగులో ఉత్సాహం అని రఫ్ గా అనువాదం చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ ట్రాన్స్ లేషన్ కాదు.  సెక్సీగా ఉండే ఉత్సాహం లాంటిది. నిజమే కదా ఆమెకు ఉత్సాహమే.. చూసిన వారికి కూడా ఉత్సాహమే! సాధారణ ఉత్సాహం కాదు.. డబల్ ఉత్సాహం!

ఈ ఫోటోలలో కేతిక బ్యాక్ ఓపెన్ ఉండే ఒక టాప్ ధరించింది. టాప్ కు స్ట్రాప్స్ కూడా ఉన్నాయి కానీ అవి మరీ భూతద్దం పెట్టి చూస్తే కానీ కనపడేలా లేవు. దీంతో ఆమె బ్యాక్ అందాలను ఎంతో వయ్యారంగా వడ్డించినట్టు అయిపోయింది.  ఒక చేతిని తన పెదవులకు దగ్గరగా పెట్టుకుని సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఒకవైపుగా దువ్విన హెయిర్.. డార్క్ రెడ్ కలర్ కలర్ లిప్ స్టిక్ ఆమె ఊంఫ్ ఫ్యాక్టర్ ను డబల్ చేసి పెట్టాయి! ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "బ్యాక్ లెస్ బ్యూటీ".. "స్టన్నింగ్ & సెక్సీ బేబ్".. "సూపర్ హాట్ స్వీట్ హార్ట్" అంటూ కామెంట్లు పెట్టారు.