కంగన కోర్టు మెట్లెక్కక తప్పదా?

Fri May 19 2017 16:20:03 GMT+0530 (IST)

ముక్కుసూటిగా మాట్లాడడంతో పాటు వివాదాస్పద అంశాలపై కామెంట్లతో ఇటీవల వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ను మరో వివాదంలో ఇరుక్కుంది.ఇటీవల తను నటించిన సిమ్రాన్ సినిమా టైటిల్స్ లో అడిషనల్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కంగనా అంటూ ఆమె పేరు వేసి క్రెడిట్ ఇవ్వడంపై ఈ సినిమాకు మాటలు అందించిన అపూర్వ అస్రాని తీవ్ర అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత కేతన్ మెహతా ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘రాణి ఆఫ్ ఝాన్సీ: ది వారియర్ క్వీన్’ చిత్రంలో నటిస్తానని చెప్పిన కంగనా ఇప్పుడు మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటిస్తూ తన డ్రీమ్ ప్రాజెక్టును హైజాక్ చేసిందంటూ ఆయన నోటీసులు పంపించారు.
    
అయితే... కంగనకు నోటీసులు పంపించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదట. తమ ప్రాజెక్టుకు మాటిచ్చిన ఆమె అదే సబ్జెక్టుతో వేరే సినిమాలో ఎలా నటిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. లీగల్ ప్రొసీడవుతామని ఆయన అంటున్నారు.
    
అంతా సిద్ధం చేసుకున్నాక తమ ప్రాజెక్టును హైజాక్ చేయడం విశ్వాస ఘాతుకమేనని.. ఈ విషయాన్ని అంతతేలికగా వదిలిపెట్టబోమంటూ మెహతా కారాలు మిరియాలు నూరుతున్నరాు. చూడబోతే కంగన కోర్టు మెట్లెక్కక తప్పేలా లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/