Begin typing your search above and press return to search.

కొట్టుడు మొదలుపెట్టేసిన కేశవ

By:  Tupaki Desk   |   24 March 2017 4:41 AM GMT
కొట్టుడు మొదలుపెట్టేసిన కేశవ
X
వరుసగా హిట్స్ కొట్టడం ఇప్పటి కుర్రాళ్లకు అలవాటయిపోయింది. ట్రాక్ తప్పకుండా తమ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే ఎలిమెంట్స్ మిస్ కాకుండా.. యంగ్ హీరోలు బాగానే అలవాటు చేసుకుంటున్నారు. అయితే నిఖిల్ మూవీపై టాలీవుడ్ లో జనాల అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది.

నిఖిల్ హీరోగా నటిస్తున్న కేశవ మూవీకి.. ఒక్క రోజులో 1 మిలియన్ వ్యూస్ దక్కడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. అంతే కాదు.. టీజర్ రిలీజ్ రోజున ఇండియాలో టాప్ ట్రెండింగ్ గా నిలిచిందంటే.. కేశవ టీజర్ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో రికార్డులు ఇప్పుడు కామన్ అయ్యాయి కానీ.. ఈ వ్యూస్ తో నిఖిల్ రికార్డులను కూడా కొట్టడం.. వేటాడ్డం మొదలుపెట్టేశాడని అనుకోవచ్చు. ఎలాగూ సినిమాలో పగ తీర్చుకునే కాన్సెప్ట్ కాబట్టి.. సినిమాలో కూడా కంటెంట్ ఇదే ఉంటుంది. కాకపోతే.. కాసింత ముందుగా ఈ కొట్టడం మొదలుపెట్టాడంతే.

నిఖిల్ అద్భుత నటనకు.. దర్శకుడు సుధీర్ వర్మ టేకింగ్.. కంపోజర్ సన్నీ ఎంఆర్ అందించిన బీజీఎం.. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి కెమేరా వర్క్.. ఈ టీజర్ కు హైలైట్ గా నిలిచాయని అంటున్నారు నిర్మాతలు. కేశవలో నిఖిల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా.. ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/