Begin typing your search above and press return to search.

బాహుబలిని తట్టుకుని బాగానే తెచ్చాడు

By:  Tupaki Desk   |   27 May 2017 7:55 AM GMT
బాహుబలిని తట్టుకుని బాగానే తెచ్చాడు
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం ముందు తెలుగు సినిమాలే కాదు.. వేరే భాషల చిత్రాలు కూడా తట్టుకోలేకపోతున్న టైంలో థియేటర్లలోకి దిగింది ‘కేశవ’. ఈ సినిమా రిలీజయ్యే ముందు వీకెండ్లో కూడా బాహుబలి-2 అదరగొట్టింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఉనికిని చాటుకోవడం ‘కేశవ’కు అంత సులువేమీ కాదన్నారు ట్రేడ్ పండిట్స్. కానీ ఈ చిన్న సినిమా బాహుబలి-2 ప్రభంజనాన్ని తట్టుకుని బాగానే నిలిచింది. జనాలు ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారు. ఫస్ట్ వీకెండ్లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ తో రన్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి.. ఆశ్చర్యపరిచింది. వీకెండ్ తర్వాత కూడా ‘కేశవ’ పట్టు నిలుపుకుంది. తొలి వారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

‘కేశవ’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ షేర్ రూ.7 కోట్ల దాకా ఉంది. నైజాం ఏరియాలో కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజైన ఈ చిత్రం తొలి వారంలో రూ.2.13 కోట్ల షేర్ వసూలు చేసింది. సీడెడ్లో రూ.70 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ.95 లక్షలు.. తూర్పు గోదావరిలో రూ.53 లక్షలు.. పశ్చిమ గోదావరిలో రూ.37 లక్షలు.. కృష్ణాలో రూ.51 లక్షలు.. గుంటూరులో రూ.42 లక్షలు.. నెల్లూరులో రూ.14 లక్షలు.. కర్ణాటకలో 34 లక్షలు.. షేర్ వచ్చింది. అమెరికాలో ఫస్ట్ వీక్ 2.37 లక్షల డాలర్ల (రూ.1.57 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది ‘కేశవ’. మొత్తంగా తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.6.81 కోట్ల షేర్ తెచ్చుకుందీ సినిమా. మంచి క్వాలిటీతో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ రూ.5 కోట్లే కావడం విశేషం. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు వచ్చేయగా.. కొన్ని ఏరియాల్లో లాభాల బాటలోకి వచ్చేశారు. రెండో వీకెండ్ అయ్యేసరికి అన్ని ఏరియాల్లోనూ లాభాలు గ్యారెంటీ.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/