Begin typing your search above and press return to search.

మ‌గాళ్ల మాదిరి ఆ మోడ‌ల్ సెక్స్ చేస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   16 March 2018 11:30 PM GMT
మ‌గాళ్ల మాదిరి ఆ మోడ‌ల్ సెక్స్ చేస్తుంద‌ట‌
X
కొంద‌రు ప్ర‌ముఖులు అంతా. ఏదీ దాచి పెట్టుకోరు. అడిగిందే త‌డ‌వుగా చెప్పేస్తుంటారు. ఓపెన్ గా ఉండ‌టం వారికి సుఖంగా ఉండ‌టం త‌ర్వాత‌.. అంద‌రి మ‌నసుల్లో కొత్త క‌ల్లోలానికి కార‌ణ‌మ‌వుతుంటారు. తాజాగా అలాంటి ప‌నే చేశారు ప్ర‌ముఖ మోడ‌ల్ కెందాల్‌.

ఈ పేరు విన్న‌ట్లు లేదే. ఎవ‌రీ భామ? అన్న డౌట్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. కెందాల్ అంటే ఏదో ప‌రాయిగా అనిపిస్తుంది కానీ.. కిమ్ క‌ర్దాషియ‌న్ చెల్లెలు అన్న వెంట‌నే ఆ భామ అంద‌మైన రూపం క‌ళ్ల ముందు క‌నిపించ‌క మాన‌దు. త‌న మాట‌ల‌తో చేత‌ల‌తో.. ఫోటోల‌తో పిచ్చెక్కించే కిమ్ క‌ర్దాషియ‌న్ ఎలా అయితే వార్త‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు తాజా.. తాజాగా ఉంటారో.. ఆమె చెల్లెలు కూడా అంతే. ఎంతైనా చెల్లెలు క‌దా.. కిమ్ వాసన‌లు లేక‌పోతే బాగోదు క‌దా.

కిమ్ కు ఐదుగురు చెల్లెళ్లు. వారిలో కెందాల్ జెన్న‌ర్ ఒక‌రు. మోడ‌ల్ గా మంచి పేరున్న ఆమె.. త‌న ఓపెన్ నెస్ పుణ్య‌మా అని త‌ర‌చూ వార్త‌ల్లోనే న‌లుగుతుంటారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆమె.. సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట పెట్టింది. త‌న బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ కావ‌ట‌మే కాదు..త‌న సెక్స్ లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించింది. ఆమె చెప్పిన మాట‌ల‌కు కొత్త వాద‌న‌లు తెర మీద‌కు వ‌చ్చేలా చేసింది. మ‌ళ్లీ దానిపై క్లారిటీ ఇచ్చేసింది.

అమెరిక‌న్ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ బ్లేక్ గ్రిఫిన్ తో తాను డేటింగ్ చేస్తున్న‌ట్లు చెప్పిన ఆమె.. అత‌నితో ప్రైవేటు జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు ఒప్పుకుంది. బ్లేక్ మంచోడ‌ని.. అత‌డు త‌న ప‌క్క‌న ఉండే తాను సంతోషంగా ఉంటాన‌ని చెప్పింది. ఇదిలా ఉండ‌గా.. తాను సెక్స్ చేసే విష‌యంలో పురుషుడి మాదిరి శ‌క్తి త‌న సొంత‌మ‌ని పేర్కొంది.

కెందాల్ నోటి నుంచి ఈ మాట వ‌చ్చినంత‌నే ఆమె గే అన్న ప్ర‌చారం మొద‌లైంది. దీనికి వివ‌ర‌ణ ఇచ్చిన ఆమె.. త‌న‌కు పురుషుడి మాదిరి శ‌క్తి ఉంద‌ని చెప్పానే కానీ.. తాను గేను కాన‌ని స్ప‌ష్టం చేసింది. తాను గే అయితే బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఉంటాడంటూ ప్ర‌శ్నించిన ఆమె.. మ‌గ‌ళ్ల త‌ర‌హాలో సెక్స్ చేయ‌గ‌ల‌న‌ని చెప్పింది. అంత మాత్రాన తాను గే కాద‌న్న విష‌యాన్ని తేల్చేసింది. త‌న మాట‌ల‌తో కెందాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.