Begin typing your search above and press return to search.

ఇది పక్కా మహానటి లుక్కే!!

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:29 AM GMT
ఇది పక్కా మహానటి లుక్కే!!
X
అర్జున్ రెడ్డి మూవీ ఎంత సెన్సేషన్ అయిందో.. ఆ సినిమాలో హీరోయిన్ నటించిన షాలినీ పాండే కూడా అంతే గుర్తింపు సంపాదించుకుంది. బోల్డ్ మూవీలో దాదాపు సైలెంట్ క్యారెక్టర్ చేస్తూనే.. పద్ధతిగా కనిపిస్తూనే బోల్డ్ నెస్ చూపించాల్సిన పాత్రలో.. షాలినీ జనాలను మెస్మరైజ్ చేసి పారేసింది. ఈ మూవీ తర్వాత షాలినికి వరుసగా అవకాశాలు వచ్చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సావిత్రి జీవితకథపై తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో షాలిని పాండే నటిస్తున్న సంగతి ఇప్పటికే ఖాయం కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పిక్ ను పోస్ట్ చేసింది ఈ భామ. మహానటి షూటింగ్ స్పాట్ లో తీసిన ఈ పిక్.. సెన్సేషన్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. ఈ పిక్చర్ లో షాలినీ పాండేతో పాటు కీర్తి సురేష్ కూడా ఉంది. ఇప్పటివరకూ మహానటికి సంబంధించిన స్టిల్స్ చాలానే వచ్చాయ్ కానీ.. అవేవీ అఫీషియల్ కాదు. గతంలో బయటకు వచ్చిన లుక్స్ మహానటి మూవీకి సంబంధించినవి కావని.. ఆ పాత్ర చేస్తున్న కీర్తి సురేష్ స్వయంగా చెప్పేసింది. కానీ ఇప్పుడు షాలినీ పాండే రివీల్ చేసిన ఫోటోలో మాత్రం సావిత్రి లుక్ తో పాటు.. ఆమె గెటప్ కూడా తెలిసిపోయింది.

సావిత్రి గెటప్ లో కీర్తి సురేష్ కనిపిస్తుండగా.. పక్కనే మేకప్ టచెస్ చేయించుకుంటూ షాలినీ పాండే ఈ పిక్చర్ లో ఉంటుంది. గెటప్ చూస్తే సినిమాలో ఈమె జమున పాత్ర చేస్తోందని అర్ధం అయిపోతుంది. తన 100వ ట్వీట్ తో అందరినీ ఆనందింప చేస్తానని ముందే చెప్పిన షాలినీ పాండే.. ఇలా షాక్ ఇచ్చేస్తుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.