Begin typing your search above and press return to search.

డీగ్లామ‌ర్ రోల్ ఛాన్సులివ్వ‌రూ

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:30 AM GMT
డీగ్లామ‌ర్ రోల్ ఛాన్సులివ్వ‌రూ
X
క‌థానాయిక అంటే అన్ని ర‌కాల పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాలి. కేవ‌లం గ్లామ‌ర్‌ కే ప‌రిమితం కాకుండా ఆహార్యానికి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో నటించాలి. భానుమ‌తి - సావిత్రి - జ‌మున కాలం నుంచి ర‌మ్య‌కృష్ణ‌ - సౌంద‌ర్య కాలం వ‌ర‌కూ ఇది అనుస‌రించారు. ఇటీవ‌ల వ‌స్తున్న క‌థానాయిక‌ల్లోనూ న‌ట‌న‌తో మెప్పించిన వారికే మ‌నుగ‌డ క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో మ‌ల్లూ భామ‌ల‌దే హ‌వా. మాలీవుడ్ నుంచే వ‌చ్చిన కీర్తి సురేష్ ప్ర‌స్తుతం అగ్ర‌క‌థానాయిక‌గా రాజ్య‌మేలుతోందంటే గ్లామ‌ర్ తో పాటు - న‌ట‌న‌తో మెప్పించ‌డం వ‌ల్ల‌నే.

అందాలు ఆర‌బోస్తేనే అవ‌కాశాలిస్తార‌నేది అబ‌ద్ధం అని ప్రూవ్ చేసింది కీర్తి. ఈ భామ బాల‌న‌టిగా ప్ర‌వేశించిన క‌థానాయిక అయిన నాలుగేళ్ల‌లోనే అసాధార‌ణ స్టార్‌ డ‌మ్‌ ని అందుకుంది. మ‌హాన‌టి చిత్రంతో కీర్తి పేరు జాతీయ‌ - అంత‌ర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. న‌టిగా మ‌రో మెట్టు ఎక్కింది. గ్లామ‌ర్ రోల్స్ కంటే అభిన‌యానికి ఆస్కారం ఉన్న పాత్ర‌తో పెద్ద స్థాయికి ఎద‌గ‌డం సాధ్య‌మేనని నిరూపించింది. న‌వ‌త‌రం న‌టీమ‌ణుల‌కు కీర్తి ఓ స్ఫూర్తి అని చెప్పాలి.

2013లో గీతాంజ‌లి అనే మ‌ల‌యాళ‌ చిత్రంలో కీర్తి క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌ర్వాత ప‌క్కింటి అమ్మాయిగా క‌నిపించిన ఈ భామ ఇటీవ‌ల గ్లామ‌ర్ కంటెంట్ ప‌రంగానూ త‌న‌కు తానే సాటి అని నిరూపించింది. గ్లామ‌ర్ క్వీన్‌ గా న‌టిస్తే బోలెడంత డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. దానికంటే జ‌నాల‌కు న‌చ్చే పాత్ర‌లు చేయ‌డమే ఇష్టం. డీగ్లామ‌ర‌స్ రోల్స్ చేసేందుకైనా నేను సిద్ధ‌మే. అయితే అలాంటి స్క్రిప్టుతో ఇప్ప‌టివ‌ర‌కూ న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు అని కీర్తి అంటోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అటు త‌మిళ్ లో కానీ - ఇటు తెలుగులో కానీ కీర్తిని డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేయాల్సిందిగా ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదుట‌. మ‌రి తాను కోరిన స్క్రిప్టును చెప్పే ద‌ర్శ‌కుడెవ‌రో చూడాలి.