కీర్తి సురేష్ స్టన్నింగ్ మేకోవర్

Sat Jun 15 2019 09:43:59 GMT+0530 (IST)

బూరె బుగ్గల కీర్తి సురేష్ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. మొన్నటికి మొన్న సడెన్ గా బాలీవుడ్ లో నటిస్తున్నానంటూ ప్రకటించి పెద్ద షాకిచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో తన రూపం ఎలా ఉండబోతోందో రివీల్ చేస్తూ మరో బిగ్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తాజాగా రివీలైన కీర్తి న్యూ లుక్ ఫ్యాన్స్ కి పెద్ద షాకింగ్ ట్రీట్ అనే చెప్పాలి.మహానటి సావిత్రి పాత్ర కోసం కాస్తంత బొద్దెక్కి కనిపించిన కీర్తి సురేష్ లో ఇంత సడెన్ మార్పు ఏమిటో అంటూ అంతా ఒకటే ఇదిగా మాట్లాడుకుంటున్నారు. రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్న సామెతను తూ.చ తప్పకుండా పాటిస్తోందా?   బాలీవుడ్ లో అగ్ర కథానాయికలతో పోటీపడుతూ స్లిమ్ లుక్ లో కనిపించాలని భావిస్తోందా? ఏమో.. మొత్తానికి న్యూ మేకవర్ తో చంపేస్తోంది.

కేవలం లుక్ తోనే కాదు.. తనలోని అసాధారణ నటవైదుష్యంతోనూ బాలీవుడ్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోందని అర్థమవుతోంది. అజయ్ దేవగన్- కీర్తి సురేష్ నాయకానాయికలుగా హిందీలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. క్రీడానేపథ్యంలోని బయోపిక్ ఇది. ఇక కీర్తి తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. నటిగా అన్ని రకాల పాత్రలు చేయగలగాలని .. ఏదో ఒక జానర్‌కే పరిమితమయ్యే ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కీర్తి. క్వీన్ సినిమాలో కంగనలా.. మరియాన్‌లో పార్వతి లా నవ్యత్వం నిండిన పాత్రలు చేయాలనుందని తెలిపింది. భవిష్యత్ గురించి పెద్దగా ఆలోచించను. కాలంతో ముందుకు వెళ్తుంటానని తెలిపింది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాయికా ప్రధాన చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే నగేష్ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.