Begin typing your search above and press return to search.

అవాక్కయ్యేలా మహానటి కొత్త లుక్

By:  Tupaki Desk   |   26 May 2019 12:11 PM GMT
అవాక్కయ్యేలా మహానటి కొత్త లుక్
X
మలయాళం ముద్దుగుమ్మ 'నేను శైలజ' చిత్రంతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు సాధించింది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ కీర్తి కెరీర్ ను 'మహానటి' కి ముందు.. తర్వాత అన్నట్టుగా మార్చాడు. ఒకరకంగా కీర్తి సురేష్ కూడా 'మహానటి' తర్వాత ఎలాంటి సినిమాలలో నటించాలనే విషయంలో సందిగ్ధంలో పడిపోయింది. కొంత గ్యాప్ తర్వాత కీర్తి ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన కొత్త లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. కీర్తి కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తన కెరీర్ మొదటి నుంచి కూడా కీర్తి మరీ స్లిమ్ముగా ఏమీ ఉండేది కాదు. కానీ ఈమధ్య కాస్త వెయిట్ పెరగడంతో మళ్ళీ గ్లామరస్ లుక్స్ పై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. మహానటి గట్టిగా ఫోకస్ చేస్తే సాధించలేనిది ఏముంది? అతి తక్కువ సమయంలోనే స్లిమ్ముగా మారిపోయింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లకు పోటీ అన్నట్టుగా ఇప్పుడు జీరో సైజ్ లోకనిపిస్తోంది. అయితే మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి బొద్దే ముద్దు. కీర్తి మరీ బక్కగా ఉందని వాళ్ళు ఫీల్ అవుతారో ఏమో!

కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మలయాళంలో మోహన్ లాల్ సినిమా 'మరక్కార్: అరబికడలంటే సింహం' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా అజయ్ దేవగణ్ నటించనున్న ఒక బయోపిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని టాక్ ఉంది. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. 'బధాయి హో' ఫేం అమిత్ శర్మ దర్శకుడు. అసలు ఈ స్లిమ్ మేకోవర్ బాలీవుడ్ కోసమే అనే గుసగుసలు కూడా ఉన్నాయి.