Begin typing your search above and press return to search.

ప్లెజర్ మీటింగ్ యు మ్యాడ‌మ్‌!

By:  Tupaki Desk   |   18 Feb 2019 1:01 PM GMT
ప్లెజర్ మీటింగ్ యు మ్యాడ‌మ్‌!
X
అందం.. చందం .. ప‌ద్ధ‌తైన న‌ట‌నాభిన‌యం.. ఇవ‌న్నీ ఆ ఇద్ద‌రికీ ఆభ‌ర‌ణాలు. వీటికి తోడు అవ‌స‌రం అనుకుంటే గ్లామ‌ర్ ఎలివేష‌న్ లోనూ త‌క్కువేమీ కాదని నిరూపించిన భామ ఒక‌రైతే, నేను మ‌హాన‌టిని అనే త‌ర‌హాలో కెరీర్ ప‌రంగా పూర్తిగా సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన‌ ఓ జోన‌ర్ కి ప‌రిమిత‌మైన భామ ఇంకొక‌రు. ఆ ఇద్ద‌రూ ఓ చోట క‌లిస్తే ఎంత చూడ ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. సీనియ‌ర్ మ్యాడ‌మ్ విద్యా బాల‌న్ ని క‌లిసిన శుభ‌వేళ కీర్తి సురేష్ ఇలా అందంగా న‌వ్వేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది. ఆ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో త‌న అభిమానుల‌కు చేర‌వేసింది కీర్తి.

ప్లెజర్ మీటింగ్ యు మ్యాడ‌మ్‌! ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన సంద‌ర్భ మిది అంటూ కీర్తి ఆనందంగా ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేయ‌డం విశేషం. మ‌హాన‌టి చిత్రంతో ఇటు సౌత్ లోనే కాదు, అటు ఉత్త‌రాదినా కీర్తి పేరు పాపుల‌రైంది. ఇక డ‌ర్టీపిక్చ‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించిన విద్యా బాల‌న్ ఇప్ప‌టికే క‌థానాయ‌కుడు చిత్రం తో తెలుగు వారికి మ‌రింత‌గా చేరువ‌య్యారు.

ఒక సీనియ‌ర్ ఇంకో జూనియ‌ర్ తో ఇంత‌గా క‌లిసిపోవ‌డం అన్న‌ది త‌న‌కే చెల్లింది. మ‌రి న‌ట‌న‌లో ఏవైనా టిప్స్ ని కీర్తికి చెప్పారో ఏమో మ్యాడ‌మ్. అన్ని వేళ‌లా పద్ధ‌తైన చీర‌క‌ట్టు అనుకూలం కాదు.. అప్పుడ‌ప్పుడు డ‌ర్టీగానూ క‌నిపించాల‌ని నూరిపోసారో ఏమో మ్యాడ‌మ్. మొత్తానికి కీర్తిలో ఆ మార్పు ఏదో మొద‌ల‌వుతుందేమో! అంటూ అప్పుడే అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బ‌హుశా డ‌ర్టీ పిక్చ‌ర్ కి స‌రిప‌డే క‌థాంశం.. స‌రంజామాతో బ‌యోపిక్ తీసేవాళ్లు ఎవ‌రైనా క‌థ చెప్పాలే కానీ కీర్తి కాద‌ని అంటుందా? 100 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా బాల‌న్ లా ఎదగాలంటే ఆ మాత్రం సాహ‌సం చేయాలేమో! విద్యాబాల‌న్ ప్ర‌స్తుతం సౌత్ లోనూ పాపుల‌ర‌య్యారు కాబ‌ట్టి ఇక‌పైనా ఇక్క‌డ న‌టిస్తారేమో చూడాలి. కీర్తి మాత్రం ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బాగా స్లో అవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌ర‌క్కార్ అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ తో పాటు త‌న కెరీర్ 20వ సినిమాలో న‌టిస్తోంది.