జయలలిత లేదు.. శ్రీదేవీ లేదు

Wed May 16 2018 10:30:22 GMT+0530 (IST)

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో వచ్చిన మహానటి సినిమా తెలుగు - తమిళ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా నచ్చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించడం కాకుండా జీవించేసిందనే గుర్తింపు తెచ్చుకుంది. అన్నివైపుల నుంచి వస్తున్న ప్రశంసలతో ఆమె ఆనందంతో ఉప్పొంగిపోతోంది.మహానటి బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోవడంతో బయో పిక్ లపైనా ఆసక్తి పెరిగింది. తమిళనాట రాజకీయాల్లో అమ్మగా గుర్తింపు తెచ్చుకున్న జయలలిత జీవిత కథతో మరో బయోపిక్ వస్తోందని.. ఈ రోల్ కూడా కీర్తి సురేష్ చేయబోతోందని కోలీవుడ్ లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ రోల్ కీర్తి అదరగొట్టేస్తుందని  అక్కడ పత్రికలు కొన్ని కథనాలు కూడా రాసేశాయి. కీర్తి వీటన్నింటిని కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను ఏ బయోపిక్ లో నటించడం లేదని తేల్చి చెప్పేసింది. మహానటి మూవీ నడిగర్ తిలగం పేరుతో తమిళంలో డబ్ అయింది. అక్కడా ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది.

ఇటీవల కాలంలో మరలిరాని లోకాలకు వెళ్లిపోయిన అందాల సుందరి శ్రీదేవి జీవిత గాథతో సినిమా చేసే ఛాన్సుందా అంటే అలాంటి ఆఫర్ కూడా ఏమీ లేదని కీర్తి సురేష్ చెప్పేసింది. మహానటి సినిమాలో తాను నటించడానికి ఒకే కారణం సావిత్రి అని.. ఆ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉందంటోంది కీర్తి సురేష్.