కీర్తి సురేష్ మొదటి సినిమా.. అలా..

Thu May 24 2018 17:54:37 GMT+0530 (IST)

మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోల లెవెల్లో క్రేజ్ అందుకుంది కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో ఆమె కనిపించిన విధానం. నటించిన విధానం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తెరపై మళ్లీ సావిత్రిని చూశాము అని చెబుతున్నారు అంటే కీర్తి ఎంత కష్టపడిందో చెప్పనక్కర్లేదు. అయితే కీర్తి ఇప్పుడు స్టార్ హీరోయినా అయిపొయింది గాని ఆమె తెలుగులో మొదట నటించిన సినిమా విడుదల కాకుండానే ఆగిపోయింది.అదేంటి? మొదటి సినిమా నేను శైలజా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకేనట అంతకుముందు అమ్మడు ఐన ఇష్టం నువ్వు అనే సినిమాలో నటించింది. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది గాని సినిమా బిజినెస్ లేక విడుదల చేయలేకపోయారు. 2015 లో సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ బాబు అతిధులుగా వచ్చి సినిమాను ప్రమోట్ చేసే విధంగా ప్రయత్నం చేశారు.

సీనియర్ నిర్మాత రామానాయుడు మరో సీనియర్ దర్శకుడు కే.రాఘవేంద్ర రావ్ కూడా సినిమాకు సంబందించిన కార్యక్రమలలో పాల్గొనగా ఆ సినిమా కనీసం కొన్ని థియేటర్స్ లలో కూడా రిలీజ్ కాకపోయింది. దీంతో నవీన్ విజయ్ నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక కీర్తి సురేష్ ఆ సినిమా ఆగిపోయింది అని తెల్సుకొని చాలా అప్సెట్ అయ్యిందట. ఇక నెక్స్ట్ అలా కాకూడదని రామ్ - నేను శైలజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి హిట్ అందుకుంది. అది మ్యాటర్!