Begin typing your search above and press return to search.

ఆ హీరో బ‌ర్త్‌ డే కోసం కీర్తి అలా చేసింద‌ట‌

By:  Tupaki Desk   |   23 Jun 2017 7:15 AM GMT
ఆ హీరో బ‌ర్త్‌ డే కోసం కీర్తి అలా చేసింద‌ట‌
X
సెల‌బ్రిటీలందు సినిమా సెల‌బ్రిటీలు వేర‌యా అని ఊరికే అన‌లేదు. సినిమా జీవుల‌కు అభిమానుల కొర‌త అస్స‌లు ఉండ‌దు. ఇక‌.. స్టార్ హీరో.. హీరోయిన్ల‌కుఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయితే.. కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌కు సినీ న‌టులే వీరాభిమానులుగా ఉంటారు. అలాంటి వారు త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు చేసే ప్ర‌య‌త్నాలు అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటాయి.

ఇటీవ‌ల కాలంలో బిజీబిజీగా అయిపోయి.. డైరీ నిండుగా అవ‌కాశాలున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈమెకు ఇండ‌స్ట్రీలో ఎంత డిమాండ్ ఉందో.. ఫ్యాన్ ఫాలోయింగ్ అంత‌కు రెట్టింపు అని చెప్ప‌క త‌ప్ప‌దు.అయితే.. కీర్తికి.. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ అంటే పిచ్చి అభిమానం. ఆయ‌న్ను విప‌రీతంగా అభిమానించే కీర్తి.. ఇటీవ‌ల ఆయ‌న బ‌ర్త్ డే కోసం స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది.

తన అభిమాన స్టార్ హీరో నిలువెత్తు పెయింటింగ్‌ను వేసేసింది కీర్తి.. ఇందుకోసం గంట‌ల కొద్దీ టైంని వెచ్చించింది. అవుట‌ర్ లైన్ తో విజ‌య్ పెయింటింగ్‌ ను సోష‌ల్ మీడియాలో పెట్టి.. నా అభిమాన న‌టుడు విజ‌య్ కోసం నేను చేసిన చిన్న ఆర్ట్ వ‌ర్క్ అంటూ మెసేజ్ పెట్టేసింది. అమ్మ‌డి పెయింటింగ్ ఇప్పుడు వైర‌ల్‌ గా మార‌ట‌మే కాదు.. స్టార్‌ హీరోకి కీర్తి మ‌రీ ఇంత పెద్ద ఫ్యానా? అని అంద‌రూ అనుకునే ప‌రిస్థితి. ఇంత‌గా అభిమానించే అభిమాన హీరోతో క‌లిసి న‌టించే సూప‌ర్ ఛాన్స్ ను కీర్తి సొంతం చేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/