Begin typing your search above and press return to search.

వైష్ణవ్‌ తేజ్‌ కోసం ఆమె ఫిక్స్‌

By:  Tupaki Desk   |   18 May 2019 1:11 PM GMT
వైష్ణవ్‌ తేజ్‌ కోసం ఆమె ఫిక్స్‌
X
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్‌ తేజ్‌ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్‌ మరియు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే విషయమై క్లారిటీ వచ్చేసింది. మంగళూరుకు చెందిన కీర్తి శెట్టి ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన కీర్తి శెట్టి సౌత్‌ లో మెప్పించింది. తెలుగులో ఈమె ఎంట్రీకి ఈ చిత్రంతో రంగం సిద్దం అయ్యింది.

ఈ చిత్రంకు 'ఉప్పెన' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అందించబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంతో టాలీవుడ్‌ కు కీర్తి శెట్టి కూడా పరిచయం అవ్వబోతుంది. మే 25న ఈ చిత్రంను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.