Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ జీవితానికి బాహుబలి రేంజ్ సంగీతం

By:  Tupaki Desk   |   20 Oct 2017 9:45 AM GMT
ఎన్టీఆర్ జీవితానికి బాహుబలి రేంజ్ సంగీతం
X
ఈ మధ్య కాలంలో వస్తున్న అతి పెద్ద సినిమాల్లో బాగా హైప్ వస్తోంది ఏ సినిమాకంటే.. అటు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇటు బాలయ్య హీరోగా తేజ డైరక్షన్లో రూపొందుతున్న ఎన్టీఆర్ సినిమానే. ఈ బాలయ్య సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కాని.. ఖచ్చితంగా వర్మ తీసే సినిమాకంటే పెద్ద సినిమాగా తయారవుతోందనే చెప్పాలి.

నిజానికి బాలయ్య ఎన్టీఆర్ పాత్రను చేస్తారు అనేది మినహా.. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏమీ కన్ఫామ్ కాలేదు. అయితే దర్శకుడు తేజ తన హీరో అందించిన స్ర్కిప్ట్ చదివి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట. అంతేకాకుండా ఇటువంటి సినిమాకు అద్భుతమైన ఎమోషనల్ మ్యూజిక్ అవసరం కాబట్టి.. దానిని అందించే పని ఇప్పుడు భారీ సినిమాకు తన వంతుగా అద్భుతాన్ని అందించిన కీరవాణి చేతిలో పెట్టారట. బాహబలి రెండు భాగాలకూ మ్యూజిక్ అందించిన కీరవాణి.. ఆ సినిమాతో తన సత్తాను ఇండియా అంతటా మరోసారి చాటుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా తెలుగు తమిళం హిందీలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి.. ఆయన అయితేనే కరక్టు అంటూ బాలయ్య కీరవాణిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

అటు ప్రక్కన చూసుకుంటే.. వర్మ మాత్రం కొంతమంది కొత్త కొత్త సంగీత దర్శకులుతో.. బాగా ఆవేశఫూరితంగా అనిపించే ట్యూన్లను.. వాటికి నిగూడ అర్ధాలు దాగుండే లిరిక్స్ ను రాయిస్తున్నాడని టాక్ వస్తోంది. అది సంగతి.