Begin typing your search above and press return to search.

ప్రభాస్ హీరోగా పనికి రాడనేసిన కీరవాణి

By:  Tupaki Desk   |   27 March 2017 5:11 AM GMT
ప్రభాస్ హీరోగా పనికి రాడనేసిన కీరవాణి
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి 20 నిమిషాల పాటు గొప్ప ప్రసంగమే చేశాడు. తన యూనిట్లోని అందరి గురించి పేరు పేరునా ప్రస్తావించి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. ఐతే ఈ వేడుకలో అభిమానులందరినీ ఒక ఊపు ఊపింది.. తన ప్రసంగంతో అందరినీ కదిలించింది.. ఈ ఫంక్షన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం కీరవాణే. రాజమౌళి గురించి ప్రత్యేకంగా ఒక పాట ట్యూన్ చేసి తన తమ్ముడు కన్నీళ్లు పెట్టుకునేలా చేయడమే కాదు.. ప్రభాస్ గురించి కూడా కీరవాణి చాలా బాగా మాట్లాడాడు. ప్రభాస్ హీరోగా పనికి రాడు.. అతడిలో హీరో క్వాలిటీస్ లేవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.

ప్రభాస్ లో ఏం క్వాలిటీస్ ఉన్నాయో అందరికీ తెలుసని.. కానీ అతడిలో కొన్ని లక్షణాలు లేవని అన్నాడు కీరవాణి. అలా అని కొన్ని క్షణాల పాటు అందరినీ విస్మయానికి గురి చేసిన కీరవాణి.. ఆ తర్వాత ‘‘అతడిలో అహం లేదు’’ అన్నారు. అలాగే కొనసాగిస్తూ.. ‘‘అతడికి గర్వం లేదు.. స్టైల్ కొట్టడు.. కంత్రీ కాదు.. బిల్డప్ ఇవ్వడు.. అసలు హీరోకు ఉండాల్సిన చాలా లక్షణాలు అతడికి లేవు. అలాంటపుడు అతణ్ని హీరో ఎలా అంటామండీ’’ అని ప్రశ్నించాడు కీరవాణి. అసలు ఏదైనా వేడుకకు వచ్చినపుడు అవతలి వాళ్లను ఎలా చూడాలో కూడా ప్రభాస్ కు తెలియదని.. నేరుగా వెళ్లి వాళ్లను హగ్ చేసుకుని మాట్లాడేస్తుంటాడని.. చాలామంది హీరోల్లాగా చూసీ చూడనట్లు ఓరకంటితో చూసి వెళ్లిపోవడం కూడా ప్రభాస్ కు చేతకాదని పొగరు చూపించే హీరోలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ.. ప్రభాస్ కు కితాబిచ్చాడు కీరవాణి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/