Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ట్రైలర్లో ఆ సౌండ్ అదా?

By:  Tupaki Desk   |   27 March 2017 4:40 AM GMT
బాహుబలి-2 ట్రైలర్లో ఆ సౌండ్ అదా?
X
‘బాహుబలి-2’ ట్రైలర్ కు అద్భుతమైన విజువల్స్ మాత్రమే కాదు.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణ. ముందు పెద్దగా సౌండ్స్ ఏమీ లేకుండా మామూలుగా ప్రభాస్ వాయిస్ తో మొదలవుతుంది ఈ ట్రైలర్. తర్వాత ట్రైలర్ రొమాంటిక్ మోడ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత కళ్లు చెదిరే యుద్ధ సన్నివేశాలకు తగ్గట్లుగా పల్స్ రేట్ పెంచేస్తూ.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్తుంది. ఆ సందర్భంగా బ్యాగ్రౌండ్లో ఒక రకమైన అరుపు ఒకటి వినిపించడం గమనించే ఉంటారు. ఆ సౌండ్ తాలూకు ఆసక్తికర విశేషాల్ని ‘బాహుబలి-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బయటపెట్టాడు కీరవాణి.

వై కట్టప్ప కిల్డ్ బాహుబలి.. దాదాపు రెండేళ్లుగా ‘బాహుబలి’ ప్రియుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అయిపోయింది. ఈ ప్రశ్ననే ప్రచారాస్త్రంగా మార్చుకుని సినిమాను ప్రమోట్ చేస్తోంది ‘బాహుబలి’ టీం. ఈ నేపథ్యంలో ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే సౌండింగ్ తో ‘ది కంక్లూజన్’ ట్రైలర్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ చేయాలని కీరవాణి అనుకున్నాడట. అందుకోసం ట్యూన్ కూడా రెడీ చేశాడట. ఐతే రాజమౌళి మాత్రం తనకు ఇందులో ‘వై’ మాత్రమే చాలు అని చెప్పాడట. దీంతో తాను ‘వై’ అనే సౌండింగ్ మాత్రమే ఇచ్చానని.. ట్రైలర్ బ్యాగ్రౌండ్లో జాగ్రత్తగా గమనిస్తే ఈ సౌండింగ్ వినిపిస్తుందని.. అది తన వాయిసే అని చెప్పాడు కీరవాణి. మామూలుగా అయితే అదేదో పిచ్చి సౌండ్ అనుకుంటాం కానీ.. అందులో ఇంత మర్మం ఉందని కీరవాణి మాటల్ని బట్టి అర్థమైంది. ‘బాహుబలి’ టీం ‘ది కంక్లూజన్’ విషయంలో ఎంత కసరత్తు చేసిందో చెప్పడానికి ఇదొక చిన్న రుజువు మాత్రమే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/