Begin typing your search above and press return to search.

యాభై కోట్ల క్లబ్బులో చేరిన కేదార్ నాథ్

By:  Tupaki Desk   |   15 Dec 2018 10:43 AM GMT
యాభై కోట్ల క్లబ్బులో చేరిన కేదార్ నాథ్
X
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ 'కేదార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు జోడీగా సారా నటించింది. మొదటి సినిమా అయినప్పటికీ సారా నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం జోరుగా దూసుకుపోతోంది.

డిసెంబర్ 7 న విడుదలైన ఈ సినిమా విడుదలైన ఎనిమిదో రోజున యాభై కోట్ల మార్కును దాటి 51.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. వారం దాటినా ఇంకా కలెక్షన్స్ నిలకడగా ఉండడం ఫిలిం మేకర్స్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. సారా డెబ్యూ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఖుషీ గా ఉన్నారట. 2013లో కేదార్‌నాథ్ వరదల నేపథ్యంలో ఒక ప్రేమకథ ను జోడించి అభిషేక్ కపూర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇక సారా నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే 'టెంపర్' హిందీ రీమేక్ 'సింబా' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కాగా దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ సినిమా డిసెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.