Begin typing your search above and press return to search.

పట్నాయక్.. భలే సేఫ్‌ గేమ్ ప్లాన్

By:  Tupaki Desk   |   28 Aug 2016 6:36 AM GMT
పట్నాయక్.. భలే సేఫ్‌ గేమ్ ప్లాన్
X
అసలు సినిమా ప్రమోషన్లకు మీడియాలో ఊదరగొట్టకపోతే ధియేటర్లకు జనాలు వస్తారా?? అటువంటి మీడియా మీదనే మీరు ఇలా చేస్తున్నారు అంటూ సెటైర్ వేస్తే మీడియా పెద్దలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆర్.పి.పట్నాయక్ ''మనలో ఒకడు'' అనే సినిమాతో వస్తున్నాడు కదా.. ఆ సినిమా కోసం ఇలాంటి ట్రబుల్స్ ఏమైనా వస్తాయేమోనని అందరూ భయపడ్డారు. కాని ఈ స్ర్టగ్లింగ్ కంపోజర్ కూడా చాలా తెలివైనవాడే సుమీ.

గత రాత్రి జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకకు ఏకంగా టి.ఆర్.ఎస్. ఎంపి కల్వకుంట్ల కవిత వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ''మీడియాలో వచ్చేది న్యూస్‌ కాదు.. వ్యూస్‌ అని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఒక్కొక్క కోణాన్ని చూపిస్తున్నారు కానీ వాస్తవాన్ని చూపడం లేదు. కన్‌ స్ట్రక్టివ్‌ క్రిటిసిజమ్‌ ఉన్నప్పుడే మీడియా కానీ, సినిమా కానీ బాగుపడుతుంది'' అన్నారు. ఈ మాటలతో ఆవిడ ఇచ్చిన సపోర్టు మామూలుగా లేదుగా. ఇప్పుడు ఒకవేళ పట్నాయక్ తీసిన సినిమా ఎవరైనా ఒక మీడియా హౌస్ ను టార్గెట్ చేసినా కూడా.. ఇలా వెనుక కవిత సపోర్టు కాస్త కనిపించిందంటే మాత్రం సదరు మీడియా కూడా మౌనంగా ఉండటమే తప్పించి.. పట్నాయక్ ను టచ్ చేసే పనిచేయరు. అందుకే భలే సేఫ్‌ గేమ్ ప్లాన్ చేశాడని అంటున్నారు అందరూ.

అయితే పట్నాయక్ ఈ సినిమాలో ఒకవైపు మీడియాను టార్గెట్ చేస్తూనే.. మరోవైపు మీడియాలోని గొప్ప గొప్ప జర్నలిస్టుల గురించి.. వారి సిద్దాంతాల గురించి.. అద్భుతంగా చెప్పాడట. చూద్దాం ఏం చూపిస్తాడో!!