Begin typing your search above and press return to search.

అబ్బబ్బా.. తడి అందాల్లో కాజల్ కేకలే

By:  Tupaki Desk   |   1 Sep 2016 3:55 AM GMT
అబ్బబ్బా.. తడి అందాల్లో కాజల్ కేకలే
X
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని అందం చందమామ కాజల్ అగర్వాల్ సొంతం. అందుకే ఎన్ని ఫ్లాపులు ఎదురైనా.. ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టేస్తుంటాయి. ఇక కెరీర్ ఖేల్ ఖతం అనుకున్నప్పుడల్లా భారీ ఆఫర్లు తలుపు తడుతుంటాయి. ఇంతగా ఆడియన్స్ ను ఆకట్టుకునే ఈ సుందరాంగి.. ఓ సినిమాలో బికినీ వేసిందనే వార్త కొన్ని రోజుల క్రితం హల్ చల్ చేసేసింది. ఆ కోలీవుడ్ మూవీనే కావలై వేండాం.

జీవాకి జోడీగా కాజల్ ఈ సినిమాలో నటించగా.. స్విమ్మింగ్ పూల్ లో బికినీ టైపు డ్రస్సుకి.. ఓ ట్రాన్స్ పరెంట్ టాప్ వేసిన కాజల్ ఫోటోలు గతంలోనే బయటకొచ్చాయి. ఇప్పుడీ పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. సెప్టెంబర్ 2న సింగిల్ రిలీజ్ చేయబోతున్నామంటూ చెప్పిన యూనిట్.. కాజల్ తడి అందాలను కాసేపు చూపించింది. సినిమాలో కూడా ట్రాన్స్ పరెంట్ టాప్ అలానే ఉంది కానీ.. కెమేరా కన్ను కాసింత తీక్షణంగానే కాజల్ అందాలపై కన్నేసింది.

'ఎన్ పల్స్ యెత్తిటు పోరియే' అంటూ సాగే సాంగ్ కూడా బాగా క్యాచీగా ఉండడంతో.. తడిసిన అందాలతో కాజల్ బాగానే రెచ్చిపోయి డ్యాన్స్ వేసింది. పైగా ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించనంత గ్లామర్ కూడా ఉండడంతో.. కావలై వేండాం సింగిల్ కోసం చందమామ అభిమానులు ఎదురుచూసేస్తున్నారు. అబ్బబ్బా.. ఎంతైనా తడి అందాల్లో కాజల్ కేకలే అంటూ లొట్టలేస్తూ వెయిటింగ్ ఇక్కడ.