ఫస్ట్ లుక్: డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్

Fri Nov 09 2018 12:56:27 GMT+0530 (IST)

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది.  ఇప్పటికే బయటకు వచ్చిన 'కవచం' అనే పవర్ఫుల్ టైటిల్ ని కన్ఫాం చేశారు ఫిలిం మేకర్స్.  ఇక ఫస్ట్ లుక్ లో శ్రీనివాస్ ఒక పోలీస్ గెటప్ లో కనిపించాడు.  శ్రీనివాస్ కెరీర్లో పోలీస్ పాత్ర పోషించడం ఇదే మొదటిసారి.  చేతికి వాచీ..కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని శ్రీనివాస్ యమా స్టైలిష్ గా ఉన్నాడు. పొడవుగా ఉండడం.. ఫిట్ పర్సనాలిటీ కావడంతో  ఖాకీ యూనిఫామ్ బెల్లంకొండ బాబుకి పర్ఫెక్ట్ గా సెట్టయింది.  బ్యాక్ గ్రౌండ్ లో కంటైనర్లు అవీ చూస్తుంటే ఏదో పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ సెట్ చేశారని అనిపిస్తోంది. టైటిల్ లోగోను కూడా పవర్ఫుల్ ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేశారు.  ఇక ఫస్ట్ లుక్ లోనే డిసెంబర్ రిలీజ్ అంటూ కన్ఫాం చేశారు.   థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట.. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందట.

కాజల్ అగర్వాల్.. మెహ్రీన్ లు ఈ సినిమాలో హీరోయిన్లు.  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు.  థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఛోటా కె. నాయుడు ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు.  ఈ సినిమాను వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంటినేని నిర్మిస్తున్నాడు.