Begin typing your search above and press return to search.

కౌశల్‌ 'కుక్క' వ్యాఖ్యలతో రచ్చ- రోల్‌ కన్నీరు

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:49 AM GMT
కౌశల్‌ కుక్క వ్యాఖ్యలతో రచ్చ- రోల్‌ కన్నీరు
X
తెలుగు బుల్లి తెరపై సంచలన గేమ్‌ షోగా దూసుకు పోతున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. మరో వారం అయితే ఈ షో ముగియనున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం గేమ్‌ షోలో కౌశల్‌ - గీతా మాధురి - తనీష్‌ - రోల్‌ రైడా - సామ్రాట్‌ - దీప్తిలు ఉన్న విషయం తెల్సిందే. ఆ ఆరుగురిలో అయిదుగురు ఒక వైపు కాగా కౌశల్‌ మాత్రం ఒంటరిగా కొనసాగుతున్నాడు. కౌశల్‌ ప్రస్తుతం ఇంట్లో ఏకాకి అంటూ కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కౌశల్‌ ను ఇంటి సభ్యులు ఏకాకిని చేసి ఆడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కౌశల్‌ ను వారు ఏ స్థాయిలో టార్గెట్‌ చేస్తున్నారో తాజా ఎపిసోడ్‌ తో క్లారిటీ వచ్చేసింది.

గీతా మాధురి మరియు కౌశల్‌ ల మద్య ఒక విషయమై చర్చ జరుగుతున్న సమయంలో అంతా కూడా కౌశల్‌ కు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. అదే సమయంలో తననే ఎందుకు టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారు, ఆమెను ఎందుకు ప్రశ్నించరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరు తనపై కుక్కల్లా పడుతున్నారు అంటూ కౌశల్‌ ఆవేశంలో మాట అనేశాడు. దాంతో ఇంటి సభ్యులు అంతా కూడా ఒక్కసారిగా కౌశల్‌ పై దాడి చేసినంత పని చేశారు. ముఖ్యంగా సామ్రాట్‌ ఒరేయ్‌ అంటూ మీది మీదకు వచ్చాడు. తనీష్‌ నీ సంగతి బయట చూస్తా అంటూ హెచ్చరించాడు. ఇక రోల్‌ రైడా ఆ వ్యాఖ్యలకు తీవ్రంగా మనస్థాపం చెందినట్లుగా అనిపిస్తోంది.

కౌశల్‌ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన ఇంటి సభ్యులు అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదే సమయంలో రోల్‌ రైడాది ఫేక్‌ ఎమోషన్‌ అంటూ కౌశల్‌ అనడంతో మరోసారి ఇంట్లో రచ్చ జరిగింది. రోల్‌ రైడా చాలా సమయం కన్నీరు పెట్టుకున్నాడు. మరో వైపు కౌశల్‌ ఆర్మీ ఈ విషయంలో కూడా కౌశల్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు కుక్క అంటూ సంబోధించుకున్న వీడియోలు పోస్ట్‌ చేసి అప్పుడు లేని ఇబ్బంది, అప్పుడు రాని కోపాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

గతంలో ఒకానొక సమయంలో రోల్‌ ను తనీష్‌ కుక్కలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు, అదే సమయంలో గీత మాధురి అవును నేను కుక్కనే అనడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ ట్రెండ్‌ చేస్తోంది. మొత్తానికి సీజన్‌ ముగింపు సమయంకు ఇంట్లో రచ్చ పీక్స్‌కు చేరింది.