Begin typing your search above and press return to search.

నాని కాస్కో.. కౌశల్‌ ఆర్మీ హెచ్చరిక!

By:  Tupaki Desk   |   18 Sep 2018 1:20 PM GMT
నాని కాస్కో.. కౌశల్‌ ఆర్మీ హెచ్చరిక!
X
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా చాలా పవర్‌ ఫుల్‌ అయ్యింది. చిన్న విషయాలు కూడా కొన్ని సార్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో హీరోల అభిమానులు ఇతర హీరోలను బ్యాడ్‌ చేస్తూ పోస్ట్‌ చేస్తున్న పోస్ట్‌లకు భారీగా రెస్పాన్స్‌ ఉంటుంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కౌశల్‌ ఆర్మీ అనుకున్నది ట్రెండ్‌ అవుతుంది, వారు ఏది పోస్ట్‌ చేస్తే అది వైరల్‌ అవుతుంది. అంతటి పవర్‌ ఫుల్‌ కౌశల్‌ ఆర్మీ ఇప్పుడు నానిని బెదిరిస్తున్నారు.

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నాని బిగ్‌ బాస్‌కు హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌ అయిన కౌశల్‌ కు సోషల్‌ మీడియాలో భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఇంటి సభ్యులు ఎవరైనా కౌశల్‌ను టార్గెట్‌ చేస్తే వారిని కౌశల్‌ ఆర్మీ టార్గెట్‌ చేస్తుంది. అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కౌశల్‌ ను నాని టార్గెట్‌ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కౌశల్‌ ఆర్మీ తీవ్ర స్థాయిలో నానిపై విరుచుకు పడుతున్నారు. ఆమద్య బిగ్‌ బాస్‌ కు నాని సరైన హోస్ట్‌ కాదు అంటూ హ్యాట్‌ ట్యాగ్‌ క్రియేట్‌ చేసి జాతీయ స్థాయిలో దాన్ని ట్రెండ్‌ చేయడం జరిగింది. అంతటి పవర్‌ ఉన్న కౌశల్‌ ఆర్మీ ఇప్పుడు నాని తాజా చిత్రం ‘దేవదాస్‌’ను టార్గెట్‌ చేశారు.

కౌశల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, కౌశల్‌ ను టార్గెట్‌ చేస్తున్న వారికి బుద్ది చెప్పకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ పదే పదే కౌశల్‌ ను విమర్శిస్తున్న నాని సినిమా ‘దేవదాస్‌’ను బ్యాన్‌ చేయాలంటూ కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియా ద్వారా పిలుపునివ్వడం జరిగింది. నాని తమతో పెట్టుకున్నందుకు దేవదాస్‌ కు తీవ్ర నష్టం కుగజేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే సినిమా బాగుంటే ఎవరేం చేసినా, ఎవరెంతగా ప్రయత్నించినా కూడా సినిమాను కిల్‌ చేయడం ఎవరి తరం కాదు అంటూ మరి కొందరు అంటున్నారు. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం కౌశల్‌ ఆర్మీకి కాస్త భయపడుతున్నట్లుగా ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది.