Begin typing your search above and press return to search.

క‌త్తి లాంటి బికినీ పోజు

By:  Tupaki Desk   |   8 March 2017 1:14 PM GMT
క‌త్తి లాంటి బికినీ పోజు
X
అందాల్ని ఎక్స్ పోజ్ చేయాలంటే అందుకు త‌గ్గ ఫిగ‌ర్ కూడా ఉండాలి. బాలీవుడ్లో అలాంటి ప‌ర్ఫెక్ట్ ఫిగ‌ర్ ఉన్న హీరోయిన్ల‌లో క‌త్రినా కైఫ్ పేరు ముందు చెప్పుకోవాలి. అమ్మ‌డు బికినీ వేస్తే ఆ బికినీకే అందం వ‌స్తుంది. మ‌ధ్య‌లో వ్య‌క్తిగ‌త జీవితంలో వివాదాల వ‌ల్ల కావ‌చ్చు.. సినిమాలు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు.. క‌త్తి కొంచెం లైమ్ లైట్లోంచి వెళ్లిపోయింది. కానీ ఈ మ‌ధ్య అమ్మ‌డు మ‌ళ్లీ రెచ్చిపోతోంది.

తాజాగా క‌త్రినా బికినీ అందాల‌తో మైమ‌రిపిస్తూ ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. విడిపించి విడిపించ‌కుండా.. క‌నిపించి క‌నిపించ‌కుండా ఆమె బికినీ అందాల్ని ఆరేసిన తీరు వావ్ అనిపిస్తోంది. త‌న జీవితం మొత్తం పోటుకు ఎదురెళ్ల‌డ‌మే అని.. తాను పుట్ట‌డం అలా పుట్టాన‌ని.. వేదాంతం వ‌ల్లిస్తూ ఈ హాట్ ఫొటోను షేర్ చేసింది క‌త్రినా. చాన్నాళ్ల త‌ర్వాత క‌త్రినా ఇలా హాట్ అవ‌తారంలో క‌నిపించ‌డం ఆమె అభిమానుల్ని మురిపించింది. త‌న మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న క‌త్రినా న‌టించిన జ‌గ్గా జాసూస్ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/