చీవాట్లు తిన్న అక్కా చెల్లెళ్లు

Fri Sep 14 2018 19:44:26 GMT+0530 (IST)

సల్మాన్ భాయ్ కి సోదరి అర్పితా ఖాన్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఒక అనాధను తెచ్చి తమ ఇంట సలీమ్ ఖాన్ పెంచుకున్నారు. సల్మాన్ చిన్నప్పటి నుంచి అర్పితను సొంత చెల్లెలుగా అల్లారుముద్దుగా పెంచాడు. తనంటే విపరీతమైన ప్రేమ - వాత్సల్యం. అందుకే తనకు నచ్చిన చెలికాడితో హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గారాల చెల్లి పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు. అదంతా సరే.. ప్రతియేటా వినాయక చవితి సంబరాల్ని సల్మాన్ భాయ్ తన సోదరి అర్పిత ఇంట్లోనే జరుపుకుంటున్నారు. అక్కడ గ్రాండ్‌గా ఇండస్ట్రీ వర్గాలకు పార్టీని ఇస్తుంటాడు.ఈసారి కూడా గణపతి విగ్రహాన్ని అర్పితా ఖాన్ ఇంట్లోనే ఏర్పాటు చేసి - అక్కడ సంబరాలు చేస్తున్నాడు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఆ ఇంటికి వచ్చి పూజలు చేసి విందారగించి మరీ వెళుతున్నారు. అయితే ఈసారి స్పెషల్ ఏమంటే అర్పిత ఇంటికి సల్మాన్ గాళ్ ఫ్రెండ్ కత్రిన కైఫ్ తన సోదరి ఇసబెల్లా ఖాన్ తో కలిసి విచ్చేసింది. ఆ ఇద్దరూ గణపతి బప్ప మోరియాకు సింబాలిక్ గా ఉండేలా రెండ్ - పింక్ కాంబినేషన్ డ్రెస్ లో దిగిపోయారు.

దేవుడి చెంతకు దిగంబర వేషం ఎందుకని భావించారో ఏమో.. క్యాట్ సిస్టర్స్ ఇద్దరూ ఎంతో పద్ధతిగా ఒళ్లంతా కప్పుకుని డిజైన్డ్ లుక్ తో వచ్చారు అక్కడికి. ఆ వేషాన్ని అభిమానులు ఇట్టే కనిపెట్టేశారు. మొత్తానికి ఇలాంటి చోట టైమింగ్ సెన్స్ - డ్రెస్సింగ్ సెన్స్ ఎంతో ఇంపార్టెంట్ అని ఈ సిస్టర్స్ చెప్పకనే చెప్పారు. అయితే కత్రిన అభిమానులు మాత్రం తనని అలా చూడలేక మరీ ఇంత పద్ధతిగానా? అంటూ తిట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలకు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ తప్పడం లేదు. ఇకపోతే కత్రిన తన సోదరి ఇసబెల్లాను పెద్ద స్టార్ ని చేసే ప్లాన్ లో ఉంది. ప్రస్తుతం ఇసబెల్లా డెబ్యూ సినిమా ఆన్‌సెట్స్ ఉంది. జూ. క్యాట్ కెరీర్ కోసం సల్మాన్ భాయ్ తనవంతు సహకారం అందిస్తున్నారు.