మైనం మల్లీశ్వరి ఇలా ఉందేంటి

Mon Apr 16 2018 12:47:10 GMT+0530 (IST)

షీలా కి జవాని లాంటి పాటలతో సినిమా ప్రేమికులకు ఎన్నో రాత్రులు నిద్రను దూరం చేసిన హీరొయిన్ కత్రినా కైఫ్ మనకు మాత్రం మల్లీశ్వరిగానే బాగా గుర్తు. పెళ్లి కాని ప్రసాద్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే పాత్రలో ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడంతా గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరొయిన్ కావాలన్న లక్ష్యం కనక లేకపోయి ఉంటె ఆ సినిమా సక్సెస్ అయ్యాక ఇక్కడే మనవాళ్ళు నెత్తిన బెట్టుకుని ఉండేవాళ్ళు. అయినా హింది సినిమాల ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉన్న కత్రినా కైఫ్ మైనపు బొమ్మ ఇటీవలే ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్  మ్యుజియంలో ప్రతిష్టించారు. సాధారణంగా అందులో ఉంచే ఈ సెలబ్రిటీ బొమ్మైనా అసలైన వాళ్ళు పక్కన నిలబడితే ఒరిజినల్ ఏదో పోల్చుకోవడం కష్టం. అంత సహజత్వం ఉట్టి పడుతూ ఉంటుంది.కాని కత్రినా కైఫ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా తేడా కొట్టేసింది. పొరపాటు ఎక్కడ జరిగిందో కాని తన విగ్రహం మాత్రం చాలా కృత్రిమంగా ఉంది. సహజంగానే కత్రినాది మంచి స్మైలీ ఫేస్. అందుకే విగ్రహం కూడా అలాగే డిజైన్ చేయబోయారు. ఒక రకమైన వింతైన నవ్వుతో పాటు ఏవగింపు గా అనిపించే ఎక్స్ ప్రెషన్ అందులో ఉండటం చూసి ఫాన్స్ భగ్గుమంటున్నారు. నిజానికి టుస్సాడ్ విగ్రహాలు అంత ఈజీగా తయారు కావు. అక్కడి నుంచి పది మంది దాకా టీంగా వచ్చి కొలతలు తీసుకుని అన్ని పక్కాగా స్కెచ్ రూపంలో వేసుకుని ఆరు నెలల నుంచి సంవత్సర కాలం దాకా టైం తీసుకుని మరీ తయారు చేస్తారు. దీని కోసం సదరు సెలెబ్రిటీలు గంటల తరబడి టుస్సాడ్ టీంకు సహకరించాలి ఉంటుంది. మరి వాళ్ళు వచ్చినప్పుడు కత్రినా ఏ మూడ్ లో ఉందో లేక కొలతలు తీసుకున్నవాళ్ళు పరధ్యానంలో ఉన్నారో కాని మొత్తానికి విగ్రహం మాత్రం తేడా కొట్టేసింది.