Begin typing your search above and press return to search.

మా మధ్య ఏం లేదు -కత్రినా

By:  Tupaki Desk   |   15 Dec 2017 6:04 AM GMT
మా మధ్య ఏం లేదు -కత్రినా
X
బాలీవుడ్ లో వైరల్ అయినా టాప్ గాసిప్స్ లలో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం ఒకటి. వీరు ప్రేమలో మునిగితేలారని అప్పట్లో కొన్ని సాక్ష్యాలు చాలానే బయటపడ్డాయి. రోజులను మర్చిపోయి విదేశాలను సైతం చుట్టేశారు. కొన్నిసార్లు కెమెరా కంట పడినా అలాగే మీడియా సమావేశాల్లో ఆ ప్రస్తావన వచ్చినా తప్పించుకునే వారు. దీంతో వారి మధ్య ప్రేమ గట్టిగానే నడుస్తోందని కొన్ని ప్రముఖ మీడియా ఛానెల్స్ కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి.

అంతే కాకుండా పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమోగాని కొన్ని రోజులకే ఇద్దరి మధ్య ఆ బంధం తెగిపోయిందని మరొక వార్త సంచలనం రేపింది. ఇక ఆ తర్వాత సల్లు భాయ్ పెళ్లి - ప్రేమ అనే పదాలను పలకడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇలా ఎన్ని జరిగినా కూడా వారు నార్మల్ గానే సినిమాలను చేస్తూ వచ్చారు. సినిమా ఒప్పుకుంటే ఎవరి పాత్రకు వారు న్యాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఇద్దరు టైగర్ జిందా హై సినిమాతో మళ్లీ ఒకటయ్యారని వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తోందని కొన్ని కామెంట్స్ వినిపించాయి.

కానీ కంత్రీనా ఆ వార్తలో కొంచెం కూడా నిజం లేదని చెబుతోంది. తాము ఇప్పటికి మంచి స్నేహితులమని నా లైఫ్ లో సల్మాన్ చాలా స్పెషల్ అని ఇటీవల ఓ చిత్ర ప్రమోషన్ లో చెప్పింది. అంతే కాకుండా మా మధ్య ఎప్పుడు విభేదాలు రాలేదని కేవలం సినిమాల బిజీ షెడ్యూల్ వల్ల కలుసుకోవట్లేదని చెబుతూ.. ప్రేమ అనే పదం మా ఇద్దరి మధ్యలో లేదు కేవలం స్నేహం మాత్రమే అని కత్రినా గట్టిగా చెప్పేసింది. అయితే ఇంతకుముందు అనేక రకాల గాసిప్స్ వస్తే అప్పుడు ఏమనకుండా ఇప్పుడు కత్రినా స్పందిస్తుంటే.. ఇంతలా సాఫ్ట్ కార్నర్ ఎందుకో అనే టాక్ మొదలయ్యింది.