Begin typing your search above and press return to search.

కొత్త సోషల్ లోకంలో కత్తిలాంటి పిల్ల

By:  Tupaki Desk   |   27 April 2017 2:12 PM GMT
కొత్త సోషల్ లోకంలో కత్తిలాంటి పిల్ల
X
సోషల్ మీడియాతో అనుసంధానం కావడం.. దాని ద్వారా అభిమానులకు మరింత చేరువ కావడం.. ఇప్పటి తరం సినీ తారలకు తప్పనిసరి అయిపోయింది. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్.. దాదాపు వీటిన్నిటిలోనూ తమకంటూ ప్రత్యేకమైన పేజ్ లను క్రియేట్ చేసుకుని.. ఫ్యాన్స్ ను తెగ అలరించేస్తున్నారంతా.

ఒకరిద్దరూ నెమ్మదిగా ఉన్నా.. మొత్తానికి అన్ని ప్లాట్ ఫాం లపైకి వస్తున్నారు. గతేడాదే ఫేస్ బుక్ లోకి అడుగు పెట్టింది బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్. అనతి కాలంలో బోలెడంత మంది ఫాలోయర్స్ ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అరంగేట్రంలోనే అదరగొట్టేసింది. "కొత్త ప్రారంభాలు.. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ నుంచి.. హెలో ఇన్ స్టాగ్రామ్" అంటూ కత్రినాకైఫ్ తను పోస్ట్ చేసిన తొలి ఫోటోతో పాటు పెట్టింది. ఓ బీచ్ ఒడ్డున తీరిగ్గా కూర్చుని ఫోటోకు పోజ్ ఇస్తున్న కేట్ మనకు ఈ ఫోటోలో కనిపిస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ ఎంట్రీకి కాసింత ఆలస్యం చేసింది కానీ.. ఆరంభంలోనే అందాల మోతతో మొదలుపెట్టిన కత్రినా కైఫ్.. మరిన్ని అప్ డేట్స్ సొగసుల వాయింపుడు చేసేయడం అయితే ఖాయమే. త్వరలో ఈ సుందరాంగి ట్విట్టర్ లో కూడా ఎంట్రీ ఇచ్చేయనుందని సన్నిహితులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/