Begin typing your search above and press return to search.

హాట్ కేట్ కాదు.. హాట్ కేక్!!

By:  Tupaki Desk   |   26 July 2016 9:30 AM GMT
హాట్ కేట్ కాదు.. హాట్ కేక్!!
X
బాలీవుడ్ హాట్ అండ్ టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందాల ప్రదర్శనలో పెద్దగా అభ్యంతరాలు చూపని కేట్.. రణబీర్ కపూర్ తో ప్రేమాయడం తర్వాత డోస్ కాస్త తగ్గించింది. అయితే.. ఆ లవ్ స్టోరీ బెడిసి కొట్టేయడంతో మళ్లీ తన పాత రూట్ లో తెగ రెచ్చిపోతోంది కత్రినా కైఫ్.

ప్రస్తుతం సిద్ధార్ధ మల్హోత్రాతో కలిసి బార్ బార్ దేఖో అనే మూవీ చేస్తోంది కత్రినా. ఇందులో కాలాచెష్మా సాంగ్ కి సంబంధించి మంచి హడావిడి నడుస్తోంది. జూలై 27న ఈ పాటను విడుదల చేయనుండగా.. దీనికోసం విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. పోస్టర్లలో కత్రినా అందాలను చూస్తుంటే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అటు ఫిగర్ ని.. ఇటు డ్యాన్స్ ని ఈ మధ్య బాగా ఇంప్రూవ్ చేసేయడంతో.. కేట్ అందాలు వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఇదంతా చూస్తుంటే.. మెగా 150కోసం ఈ భామను ఎందుకు అప్రోచ్ అవలేదా అనిపించక మానదు.

చిరు సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు రెండున్నర కోట్లు వెచ్చించనున్నారనేది టాక్. అంత మొత్తం చందమామకు ఇచ్చే బదులు.. అదే ఫిగర్ తో కత్తిలాంటి ఫిగర్ అయిన కేట్ ని తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు ఫ్యాన్స్.