ఆ గిఫ్ట్ భాయిజాన్ ఇచ్చిందేనా..?

Wed Mar 20 2019 12:51:22 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్ గా ఒక కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసింది.  రెండు కోట్ల పైచిలుకు ధర ఉండే రేంజ్ రోవర్ కారును కొనడం.. రిజిస్ట్రేషన్ చేయించడం అంతా పూర్తయింది.  తన దగ్గర ఉన్న మరో లగ్జరీ కారు ఆడి Q7 కు ఉన్న నంబర్ 8822 నే ఈ కొత్త కారుకు కూడా తీసుకుంది.  ఆ కొత్త కారులోనే 'భరత్' షూటింగ్ కు వస్తోందట. దీంతో ఈ కారు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిందట.బాలీవుడ్ సెలబ్రిటీలు రెండు మూడు కోట్ల రూపాయల విలువ గల కార్లను వాడడం సహజమైన విషయమే.. మరి ఎందుకు హాట్ టాపిక్ అయింది అంటే.. ఈ లగ్జరీ కారును బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ గిఫ్టుగా కత్రినాకు ఇచ్చాడని ముంబైలో చెవులు కొరుక్కుంటున్నారు.  సల్మాన్ - కత్రినాలు మాజీ ప్రేమికులన్న సంగతి.. మన దేశస్తులకే కాదు పరాయి దేశాలవాళ్ళకు కూడా బాగా తెలుసు.  మాజీ ప్రేమికురాలు అన్నంత మాత్రాన మొహం మాడ్చుకొని పక్కకు వెళ్ళిపోయే రకం కాదు సల్లూ భాయ్.   ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ అయినా పాత గర్ల్ ఫ్రెండ్ అయినా మంచి స్నేహితురాలిగానే ట్రీట్ చేస్తాడు. అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చాడట.   

నిజానికి సల్మాన్ మొత్తం నాలుగు రేంజ్ రోవర్ కార్లను ఆర్డర్ ఇచ్చాడట. మూడు కార్లను తన కుటుంబ సభ్యులకు గిఫ్టులుగా ఇచ్చిన సల్మాన్ నాలుగో కారును కత్రినాకు అందజేశాడని ముంబై మీడియాలో టాక్ వినిపిస్తోంది. సినిమాల విషయానికి వస్తే సల్మాన్ - కత్రినా లు 'భరత్' అనే చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది.