Begin typing your search above and press return to search.

కత్తిలా ఉండాలంటే ఇలా చేయాలి మరి

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:30 AM GMT
కత్తిలా ఉండాలంటే ఇలా చేయాలి మరి
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డ్యాన్సుల కోసమే సినిమా థియేటర్లకు పరుగులు తీసేసే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి కానీ.. కొన్నేళ్ల క్రితం కేట్ ఎదుర్కున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. యాక్టింగ్.. ఫిజిక్.. డ్యాన్స్.. ఒకటేంటి ఒక్క లుక్ లో తప్ప అన్నింటిలోనూ మైనస్ మార్కులే వేసేవారు. అలాంటి సిట్యుయేషన్ నుంచి ప్రతీ విషయంలోనూ కత్తి అనిపించుకునే రేంజ్ కి రావడంలో కత్రినా కష్టం చాలా ఉంది.

వర్కవుట్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అన్నదే కత్రినాకి తెలీదు. వారంలో మూడు రోజులు జిమ్.. మిగిలిన రోజుల్లో కార్డియో.. స్మిమ్మింగ్ లు తప్పనసరిగా చేస్తుంది కేట్. అబ్డామిన్ ఎక్సర్ సైజులు అతి ముఖ్యమైనవి కాగా.. రన్నింగ్-ఐసో ప్లాంక్-సైక్లింగ్-వెయిట్ ట్రైనింగ్ లు అదనం. ప్రతీ రోజూ కనీసం గంటకు పైగా రన్నింగ్ చేస్తుంది కత్రినా. ఎలాంటి పరిస్థితుల్లోనూ యోగాకు మాత్రం బ్రేక్ వేయదు. ఇక లైవ్ షోలు ఇచ్చేందుకు ముందుకు ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ సిస్టమ్ ఫాలో అయిపోతూ ఉంటుంది.

కర్టసీ లన్ జెస్ అనే ఫార్మాట్ కత్రినాకు బాగా ఇష్టం కాగా.. ఫిట్నెస్ విషయంలో రాజీ పడకపోవడమే కత్రినా ఇప్పటి రూపానికి సక్సెస్ కి అసలు కారణం. ఎనిమిదేళ్లుగా బ్రేక్ కూడా లేకుండా ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తోందని ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా చెబుతోందంటే.. ఈ విషయంలో కత్రినా కైఫ్ కమిట్మెంట్ ని కత్తి.. కేక అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/