Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సల్మాన్‌ తో కత్రీనా కొత్తగా కనిపిస్తుందే!!

By:  Tupaki Desk   |   11 Nov 2018 1:47 PM GMT
ఫోటో స్టోరీ: సల్మాన్‌ తో కత్రీనా కొత్తగా కనిపిస్తుందే!!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా - తన ఐటెం సాంగ్‌ తో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కత్రీనా కైప్‌ ఈమద్య కాస్త ఫేడ్‌ ఔట్‌ అయ్యిందని చెప్పుకోక తప్పదు. తాజాగా అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రంలో ఈమె పాత్రకు పెద్దగా గుర్తింపు రాక పోవడంతో పాటు - ఆ చిత్రంలోని కత్రీనా లుక్‌ కూడా విమర్శల పాలైంది. ఎప్పుడు చూసినా ఒకే రకమైన గెటప్‌ తో కత్రీనా బోర్‌ కొట్టి చేస్తోంది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో సల్మాన్‌ ఖాన్‌ తో కత్రీనా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్‌’లో విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తోంది.

కత్రీనా కెరీర్‌ ఆరంభంలో ఎలా అయితే కనిపించేదో ‘భరత్‌’ చిత్రంలో కూడా అదే తరహాలో కనిపించబోతున్నట్లుగా తాజాగా విడుదలైన పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ - కత్రీనాల జోడీ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఈ చిత్రంలో వీరిద్దరి లుక్‌ కాస్త విభిన్నంగా ఉందనిపిస్తుందంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. కత్రీనాకు ప్రస్తుతం సక్సెస్‌ చాలా కీలకం. అందుకే ఈ చిత్రంలో భిన్నంగా కనిపించాలనే ప్రయత్నాలు చేసింది. అందుకు తగ్గట్లుగానే లుక్‌ ను మార్చుకుంది. లుక్‌ ను మార్చిన కత్రీనాకు లక్‌ కలిసి వచ్చేనా చూడాలి.