Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి కావాలంటున్న హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 Feb 2016 6:04 PM GMT
రాష్ట్రపతి కావాలంటున్న హాట్ బ్యూటీ
X
బాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్ని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావని అడిగితే.. పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిలైపోవాలనుకుంటున్నా అనడం సహజం. కానీ కత్రినా కైఫ్ మాత్రం ఎవ్వరూ ఊహించని సమాధానం ఇచ్చి ఆశ్చర్యపెట్టింది. భవిష్యత్తులో తాను రాష్ట్రపతి కావాలనుకుంటున్నట్లు వెల్లడించి షాకిచ్చింది. లండన్లో పుట్టి పెరిగి అనుకోకుండా బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చిన కత్రినాకు ఇలాంటి కోరిక ఉందని ఎవ్వరూ ఊహించి ఉండరేమో. తన కొత్త సినిమా ‘ఫితూర్’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

ఫితూర్ అంటే ఒక విధమైన మానసిక స్థితి, ప్యాషన్ అన్న అర్థాలు వస్తాయి. ఐతే సినిమాలు కాకుండా మీ మనసులో మెదులుతున్న మరో 'ఫితూర్' ఏంటి అని యాంకర్ కత్రినను ప్రశ్నించగా.. ‘‘నాకు ఈ దేశానికి రాష్ట్రపతిని అవ్వాలని ఉంది. అదే ప్రస్తుతానికి నా మనసులో తిరుగుతున్న విషయం’’ అంటూ ఠకీమని జవాబివ్వడంతో షాకవ్వడం యాంకర్ వంతైంది. తాను ఏదైనా సాధించాలని మనసులో అనుకుంటే అది ఎప్పటికైనా తప్పకుండా సాధించి తీరుతానని.. రాష్ట్రపతి కావాలన్న తన కోరిక విషయంలో ఏమవుతుందో ఎవరికి తెలుసు అంటూ నవ్వేసింది కత్రినా. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా, టబు ప్రధాన పాత్రలు పోషించిన ‘ఫితూర్’.. గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ అనే చార్లెస్ డికెన్స్ నవల ఆధారంగా తెరకెక్కింది. అభిషేక్ కపూర్ దర్శకుడు. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.