Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సాటిలేని బ్యూటీ.. సింపుల్ పోజు!

By:  Tupaki Desk   |   19 July 2019 10:41 AM GMT
ఫోటో స్టొరీ: సాటిలేని బ్యూటీ.. సింపుల్ పోజు!
X
బాలీవుడ్లో చాలామందే హాట్ బ్యూటీలు ఉన్నా అందరికీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండదు. అలా హాట్ నెస్.. క్రేజ్ రెండూ ఉన్న భామ కత్రినా కైఫ్. ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పదిహేనేళ్ళు దాటింది. ఇన్నేళ్ళు కెరీర్ కొనసాగడమే గొప్ప అనుకుంటే.. కత్రినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాతో సూపర్ హిట్ సాధించింది. కత్రినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.

కత్రినా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎమోజీ మాత్రం పెట్టింది. ఫోటోలో కత్రినా జస్ట్ రోడ్ దాటుతూ ఉంది అంతే. ఫారెన్ లొకేషన్ లో చేతిలో ఒక జ్యూస్ గ్లాస్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ జీబ్రా క్రాసింగ్ పై నడుస్తూ ఉంది. పాదచారుల కోసం వేసిన ఆకుపచ్చ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు దాటుతున్నానని ఇండైరెక్ట్ గా చెప్పింది. అదే మనం అలా దాటుతామా..? మనలో చాలామంది టైటానిక్ హీరో కు తమ్ముడిలాతమ చేతిని పెట్టి చక్కా నడుచుకుంటూ పోతారు. ఆ రోడ్డుపై డ్రైవింగ్ చేసేవారి ఖర్మ అన్నట్టుగా వ్యవహరిస్తాం. మన లాంటివారికోసమే ఇలాంటి ఫోటో పోస్ట్ చేసిందేమో మరి. ట్రాఫిక్ రూల్స్ సంగతేమో కానీ కత్రినా మాత్రం ఆ షార్ట్ గౌన్ లో బొమ్మలా ఉంది. అసలే పొడవు పైగా హీల్స్ ధరించి మరింత పొడవుగా కనిస్తోంది.. ముఖ్యంగా ఆ కాళ్ళు మహా సెక్సీగా ఉన్నాయి. ఇలాంటి ఫోటోలతోనే నెటిజన్ల దుంప తెంచుతోంది.

ఈ ఫోటోకు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ "స్టన్నింగ్" అంటూ కామెంట్ పెట్టాడు. మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లైక్ కొట్టాడు. ఇక సాధారణ నెటిజన్లు కూడా రెచ్చిపోయి కామెంట్లు పెట్టారు. "నువ్వు అంత అందంగా ఎందుకుంటావు?".. "లాం....గ్ లెగ్స్ ఆర్ బ్యూటిఫుల్".. "సూపర్ క్యూట్.. నైస్ స్మైల్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం 'సుర్యవంశి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి.