Begin typing your search above and press return to search.

అమ్మడు మాత్రం బికినీని వదలట్లేదు

By:  Tupaki Desk   |   29 May 2016 7:01 AM GMT
అమ్మడు మాత్రం బికినీని వదలట్లేదు
X
కత్తిలాంటి అందాల కత్రినా కైఫ్‌ తన కెరియర్‌ ను చాలావరకు స్వయంగా ఇరకాటంలో పడేసుకుంది. ఎప్పుడైతే రణబీర్‌ కపూర్‌ తో లివ్-రిలేషన్ లో ఉండటం స్టార్టు చేసిందో.. అప్పటినుండి అమ్మడు స్కిన్‌ షో నుండి సైన్ చేసే ప్రాజెక్టుల వరకు అన్నింటిలోనూ అతడి ప్రమేయం కనిపించింది. ధూమ్‌ 3 వంటి సినిమా చేశాక కూడా కత్రినా పెద్ద లీగ్‌లోకి దూసుకెళ్ళేకపోయిందంటే ఇదే కారణం.

ఇక ఫితూర్‌ రిలీజ్‌ టైములో వీరి ప్రేమ కథకు రియల్‌ బ్రేక్‌ పడిపోయింది. పైగా ఆ బ్రేక్‌ పర్మినెంట్‌ అని అర్దమైపోతుంది. అందుకే అప్పటినుండి కత్రినా కూడా తన కెరియర్‌ ను భారీగా పరిగెత్తించాలని ఆశిస్తోంది. అప్పట్లో మ్యాగ్జిమ్‌ మ్యాగజైన్ కు బికినీల్లో లింగరీల్లో ఫోజులు ఇచ్చిందీ సుందరాంగి. అదే హాట్నెస్ ను కంటిన్యూ చేస్తే.. ఇప్పుడు వోగ్‌ వారికి కూడా సేమ్ అలాగే బికినీల్లో విందునిచ్చింది. సమ్మర్ సీజన్‌ కాబట్టి బికినీల్లో ఫోటోలు దిగకపోతే ఫ్యాంటూ షర్టూ వేసుకుంటారా అని అమ్మడు కామెడీ చేయొచ్చు కాని.. కెరియర్‌ను గాడిలో పెట్టుకోవడానికే ఇలా అందచందాలను ఆరేస్తోందని ఎవరికి తెలియదులే.

వోగ్‌ లేటెస్టు సంచికపై బికినీ వేసుకుని బీచ్‌ లో కూర్చున్న కత్రినాను చూశారుగా. అమ్మడు క్లీవేజ్ మెరుపులతో మతి పోగొట్టేస్తోంది. ఇంకా ఇటువంటి ఫోటోషూట్లు ఎన్ని చేస్తోందో కాని.. అభిమానులు మాత్రం ఉక్కిబిక్కిరి అయిపోతున్నారనుకోండి.